Harish Rao : బిడ్డా గన్‌ పార్క్‌ కి రా.. నువ్వో.. నేనో తేల్చుకుందాం!

రైతు రుణమాఫీపై తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. మాజీ మంత్రి హరీశ్‌రావు, సీఎం రేవంత్‌ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. రాజీనామా లేఖను జేబులో పెట్టుకుని సిద్ధంగా ఉండాలంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు గన్‌పార్క్‌కు రాజీనామా లేఖతో చేరుకున్నారు.

Harish Rao : బిడ్డా గన్‌ పార్క్‌ కి రా.. నువ్వో.. నేనో తేల్చుకుందాం!
New Update

Telangana : తెలంగాణలో రైతు రుణమాఫీ పై సవాల్‌ ప్రతి సవాల్‌ నడుస్తోంది. ఆగస్ట్‌ 15 లోపు రైతు రుణమాఫీ, ఆరు గ్యారంటీలు అమలు చేస్తే రాజీనామా చేస్తానన్న బీఆర్‌ఎస్‌ (BRS)ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌ రావు(Harish Rao)  ..తన రాజీనామా లేఖ తో అసెంబ్లీ గన్‌ పార్క్‌ వద్దకు వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కూడా తన రాజీనామా లేఖతో గన్‌ పార్క్‌ వద్దకు రావాలని హరీశ్‌ డిమాండ్‌ చేశారు. దీంతో అసెంబ్లీ గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.  పెద్ద ఎత్తున గన్‌ పార్క్‌(Gun Park) వద్దకు నేతలు, కార్యకర్తలు రావడంతో పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. గన్‌ పార్క్‌ వద్ద బీఆర్‌ఎస్‌ హరీష్‌ రావు(Harish Rao)  కార్యక్రమానికి కేవలం 5 గురికి మాత్రమే అనుమతి ఉన్నట్లు పోలీసులు వివరించారు. దీంతో బీఆర్‌ఎస్‌( BRS) కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.

ఏదిఏమైనా సరే లోపలికి మాత్రం 5 గురినే అనుమతిస్తామని పోలీసులు తేల్చి చెప్పడంతో నేతలు , కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దీంతో గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, బండారు లక్ష్మారెడ్డి, వివేకానంద ఉన్నారు. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నివాళులర్పించారు.

సవాళ్లు.. ప్రతి సవాళ్లు..

కాగా.. రైతు రుణమాఫీ(Rythu Runa Mafi) పై తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. మాజీ మంత్రి హరీశ్‌రావు, సీఎం రేవంత్‌(CM Revanth Reddy)  మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు మాటల యుద్ధానికి దారితీసింది. రాజీనామా లేఖను జేబులో పెట్టుకుని సిద్ధంగా ఉండాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు గన్‌పార్క్‌కు రాజీనామా లేఖతో చేరుకున్నారు. రేవంత్ కూడా అమరవీరుల స్థూపం వద్దకు రాజీనామా లేఖతో రావాలని, హరీశ్‌ రావు అన్నారు. రేవంత్ దూషణలు నిజమైతే రావాలని హరీష్ రావు సవాల్ చేశారు.

అయితే.. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించగా.. హరీశ్ రావు అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే అక్కడికి రావాలని సవాల్ విసిరారు... దీంతో రాజకీయంలో వేడి వాతావరణం చోటుచేసుకుంది. ఆగస్టు 15లోపు రుణమాఫీ నిజంగా జరిగితే.. బాండ్ పేపర్లపై రాసిచ్చిన హామీలు అమలు చేస్తామన్న మాట నిజమైతే.. గన్‌పార్క్‌కు రావాలంటూ రేవంత్‌కి హరీశ్‌రావు సవాల్ విసిరారు. ఆగస్టు 15లోపు రుణమాఫీ, ఆరు హామీలు అమలు చేస్తే మేధావులు నా రాజీనామా లేఖను తీసుకుని స్పీకర్ కు ఇస్తారన్నారు.

మీరు సిద్ధమా?

అమలు చేయకపోతే నీ రాజీనామా లేఖను గవర్నర్‌కి ఇస్తా.. మీరు సిద్ధమా? అని ప్రశ్నించారు. కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి తోకముడిచినట్లే అని హరీశ్ రావు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Also read: కోటి విలువైన వజ్రాభరణాలు చోరీ..కారు డ్రైవర్‌ మీదే అనుమానం!

#gunpark #brs #revanth-reddy #harish-rao #congress
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి