Weather Alert: బుధవారం నుంచి పెరగనున్న ఉష్ణోగ్రతలు: వాతావరణ శాఖ

తెలంగాణలో బుధవారం నుంచి క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు వెల్లడించింది. అలాగే పలు ప్రాంతాల్లో తేలకపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

New Update
Weather Alert: ఈ వేసవికి ఎండలు దంచికొడతాయి: ఐఎండీ హెచ్చరిక

Weather in Telangana: తెలంగాణలో వాతావరణ పరిస్థితులు మారిపోతున్నాయి. వేసవి కాలం రాకముందే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం, రాత్రి వేళల్లో చలిగాలులు వీస్తుండగా.. మధ్యాహ్నం మాత్రం ఎండలు దంచికొడుతున్నాయి. దీనిపై తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Department) కీలక ప్రకటన చేసింది. బుధవారం నుంచి క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని పేర్కొంది. రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు వెల్లడించింది.

Also Read: సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

ఇక మార్చి రెండోవారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని చెప్పింది. మరోవైపు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలకపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం, సోమవారం పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఎండల తీవ్రత పెరగనున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Also Read: కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి.. హరీష్ రావు డిమాండ్

Advertisment
తాజా కథనాలు