Weather Alert: బుధవారం నుంచి పెరగనున్న ఉష్ణోగ్రతలు: వాతావరణ శాఖ
తెలంగాణలో బుధవారం నుంచి క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు వెల్లడించింది. అలాగే పలు ప్రాంతాల్లో తేలకపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.