Movies:రాముడంటే ఎన్టీయరే...సీతంటే అంజలీదేవే..లేదు లవకుశకు సాటి

60 ఏళ్ళు కాదు మరో 90 ఏళ్ళు గడిచిన ఈ సినిమా గురించి చెప్పుకుంటారు. సీతారాములు అంటే వాళ్ళే అంటారు. అంతలా ముద్ర వేసిన సినిమా లవకుశ. రామాయణానికి కంటిన్యూ అయిన ఉత్తర రామాయణం కథగా తీసిని ఈసినిమా అజరామరం.

Movies:రాముడంటే ఎన్టీయరే...సీతంటే అంజలీదేవే..లేదు లవకుశకు సాటి
New Update

Lavakusa:కొన్ని సినిమాలుంటాయి..వాటిని ఎవరూ టచ్ చేయలేరు. చేసినా దానిలా కచ్చితంగా తీయలేరు. అలాంటి వాటిల్లో చాలా ముఖ్యంగా చెప్పుకోవలసింది లవకుశ సినిమా గురించి. 1963లో రూపొందిన లవకుశ తరువాతే ఏదైనా అని అంటారు అందరూ. తెలుగు వారి తొలి రంగుల చిత్రం ఇది. ఈ సినిమా విడుదల అయి 60 ఏళ్ళు అవుతున్నా నభూతో న భవిష్యతి అనదగ్గ సినిమా. ఇలాంటి పౌరాణికం ఇంకోటి లేదు అనేయవచ్చు లవకుశను చూశాక. ఇది రాముడి కథ..సీత కథ...వారి పిల్లలు లవకుశల కథ. దక్షిణాదిన ఆ రోజుల్లో కోటి రూపాయలు వసూలు చేసిన మొదటి సినిమా కూడా ఇదే. అదే ఇప్పటి లెక్కలతో పోల్చుకుంటే దాదాపు రెండు వేల కోట్లకు సమానం. ఇప్పటి సినిమాలు కూడా దీన్ని అందుకోలేవు.

Also Read:భారత వైద్యుల ఘనత..ఇద్దరు వ్యక్తులకు హ్యండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్

రాముడంటే ఎన్టీయారే..సీతంటే అంజలీదేవే..

రాముడు ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. శిల్పులు, ఆర్టిస్టులు ఎవరికి నచ్చిన రూపాన్ని వారు చెక్కారు, వేశారు. వాల్మీకి వర్ణించిన దానికి దగ్గరగా ఉన్నదాన్ని రాముడిగా ఒప్పకున్నారు. కానీ తెలుగు వారికి మాత్రం రాముడంటే ఒక్క ఎన్టీయారే. రాముడిగా రామారావు ఎన్నో సినిమాలు చేశారు. కానీ లవకుశలో ఉన్నట్టు ఇంకెందులోనూ కనబడరు. లవకుశలో రాముడిగా ఎన్టీయార్ కనిపించిన తీరు, నటించిన విధం ఎలా ఉంటుంది అంటే...ఆయన కాళ్ళ మీద పడి దణ్ణం పెట్టాలనిపించేతంలా ఉటుంది. ఈ సినిమా విడుదల తర్వాత ఎన్టీయార్ కాళ్ళ మీద పడినవారెందరో, పూజలు చేసిన వారు మరెందరో. అంతలా తెలుగు వారి మనసుల్లో ఎన్టీయార్ రాముడిగా ముద్ర వేసుకున్నారు. ఇక సీతాదేవి...వాల్మీకి రామాయణంలో సీత చాలా సౌమ్యురాలు, ముగ్ధ. లవకుశలో అంజలీదేవి అచ్చంగా అలాగే ఉటుంది. అందం, ఆహార్యం, నటన...ఇలా ఎందులో చూసినా అంజలీదేవి అద్భుతంగా ఉంటారు. సీతగా ఆమె నటన కంటనీరు పెట్టించడమే కాక మనసులను దోచేస్తుంది కూడా.

సంగీతం, సాహిత్యం...

లవకుశలో నటీనటులు ఒక ఎత్తు అయితే...సంగీతసాహిత్యాలు మరొక ఎత్తు. ఇవి రెండూ జోడుగుర్రాల్లా సాగాయి. సంగీత దర్శకుడిగా ఘంటసాల తన మొత్తం ప్రతిభను కనబర్చేశారు. ఆయన సినీజీవితంలో లవకుశ ఒక కలికితురాయి. ఈ సినిమాలో ప్రతి పాట, పద్యం మహాద్భుతం .లవకుశ సినిమాలో 12 పాటలు 20కి పైగా పద్యాలు ఉన్నాయి. మరపురాని మరచిపోలేని పద్యాలు, పాటలతో తెలుగువారిని లవకుశ అలరించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

60 వారాలు ఆడిన అవకుశ..

హైదరాబాద్‌లో బసంతి, నటరాజ్ టాకీస్‌లలో లవకుశ రిలీజ్ అయింది. ఈ రెండు సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర ఈ రెండు థియేటర్లు ఉండేవి. లవకుశ సినిమా రిలీజ్ అయ్యాక అక్కడ అంతా తిరునాళ్ళల్లా ఉండేదిట. అప్పట్లో మూడు షోలు ఉండేవి. మ్యాట్నీ, ఫస్ట్ షో, నైట్ షోలు మాత్రమే ఉండేవి. ఒకవేళ మ్యాట్నీ టికెట్లు దొరకకపోతే...అక్కడే క్లాక్ టవర్ పార్క్‌లో పడుకుని...మర్నాడు సినిమా చూసి వెళ్ళేవారుట జనం. విడుదల అయిన అన్ని చోట్లా ఘన విజయం సాధించింది. ఈ సినిమాకు బళ్ళు కట్టుకుని జనాలు పల్లెల నుంచి జాతరలా వచ్చే వారని చెబుతారు. 62 కేంద్రాల్లో వంద రోజులు ఆడిన సినిమా లవకుశ ఒక్కటే. 18 కేంద్రాల్లో 25 వారాలు ఆడింది. ఆరోజుల్లో 60 వారాలు ఆడిన ఘనత లవకుశకు దక్కుతుంది.

రేపే అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ట..

ఇప్పుడు రేపు అయోధ్య రామాలయం ప్రారంభోత్సం కారణంగా రాముడి నామ స్మరణతో దేశం మారు మోగుతోంది. అయోధ్య రాముడిని కన్నులారా చూసేందుకు జనం తహతహలాడుతున్నారు. రేపటి మహోత్సవానికి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈతరుణంలో రాముడు, ఆయన మీద వచ్చిన సినిమాలను తలుచుకుంటున్నారు.

#ntr #ayodhya #movies #rama-movie #anjalidevi #lavakusa
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe