Balakrishna: చంద్రబాబు అరెస్ట్ దుర్మార్గం.. జగన్‌పై బాలకృష్ణ ఏం అన్నారంటే..?

చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు దుర్మార్గం అని హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ అన్నారు. జగన్ సీఎం అయ్యాక అన్నం తినటం మానేసి కోర్టుల చేత చివాట్లు తింటున్నారని బాలకృష్ణ మండిపడ్దారు. 

Balakrishna: చంద్రబాబు అరెస్ట్ దుర్మార్గం.. జగన్‌పై బాలకృష్ణ ఏం అన్నారంటే..?
New Update
Balakrishna: చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు (Chandrababu Arrest) పై హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ స్పందించారు.  ఆయన అరెస్ట్ దుర్మార్గం అన్నారు.  జగన్ సీఎం అయ్యాక అన్నం తినటం మానేసి కోర్టుల చేత చివాట్లు తింటున్నారని బాలకృష్ణ మండిపడ్దారు.
కుంభకోణంలో ఎలాంటి వాస్తవం
ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి ప్రతిపక్షనేతలపై కక్షసాధింపులకు పాల్పడే ముఖ్యమంత్రి ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్బాగ్యం అన్నారు హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ . నేను 16 నెలలు జైల్లో ఉన్నాను, చంద్రబాబు నాయుడుని 16 నిమిషాలైన జైల్లో పెట్టాలన్నదే తన జీవిత లక్ష్యమన్నట్టు జగన్ (CM Jagan) కక్ష్యసాధిస్తున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో (Skill Development Case) ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడిని ఏ చట్టం ప్రకారం అరెస్ట్ చేశారు? అని ప్రశ్నించారు.  స్కిల్ డెవలప్ మెంట్ పెద్ద కుంభకోణమని ప్రచారం తప్ప.. ఇందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఇది కావాలని రాజకీయ కక్షతో చేస్తున్న కుట్ర అని బాలకృస్ణ అన్నారు.  19.12.2021లో ఎఫ్ఐఆర్ (FIR) నమోదైంది, నిజంగా అవినీతి జరిగి ఉంటే ఇంతవరకు ఎందుకు చార్జ్ సీట్‌ చేయలేదు..? అని ప్రశ్నించారు.

న్యాయపోరాటం చేస్తాం
డిజైన్ టెక్ సంస్ధ అకౌంట్‌లు ప్రీజ్ చేసి నిధులు స్తంభింబచేసినపుడు కోర్టు మీకు చివాట్లు పెట్టి ఆ డబ్బు నేరానికి సంబందించింది కాదని ఆదేశాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా..? అన్నారు.  2.13 లక్షల విద్యార్దులకు శిక్షణ ఇచ్చి 72 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారని, దీనిని కుంభకోణం అని ఏ విధంగా అంటారని స్వయంగా హైకోర్టు చెప్పలేదా..? అన్నారు.  మళ్లీ తప్పుల  మీద తప్పుల చేసి కోర్టుల చేత ఎందుకు తిట్లు తింటారని మండిపడ్డారు. జగన్ సీఎం అయ్యాక అన్నం తినటం మానేసి కోర్టుల చేత చివాట్లు తింటున్నారని ఎద్దేవా చేశారు. ఎలాంటి అవినీతి లేని కేసులో రాజకీయ కుట్రతోనే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అక్రమ అరెస్టులకు భయపడేది లేదు. దీనిపై న్యాయపోరాటం చేస్తాం.. ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటామని హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ (Balakrishna) అన్నారు.
#skill-development-case #chandrababu-arrest #balakrishna-on-chandrababu-arrest #arrest-crime #chandrababu-naidu #mla #hindupur #nandamuri-balakrishna
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe