Skill Development Case : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో జనవరి 16న సుప్రీం కోర్టు కీలక తీర్పు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.ఈ నెల16న కేసుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించనుంది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.ఈ నెల16న కేసుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించనుంది.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు షాక్ తగిలింది. A13గా ఉన్న సిరీస్ చంద్రకాంత్ షా అప్రువర్ గా మారారు. ఇందుకోసం సీఐడీ కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్స్ ఇవ్వాలని చంద్రబాబు తరుపు న్యాయవాదులు కోరగా.. పిటిషన్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. ఈ నెల 15కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది.
ప్రగతి వెలుగులు పంచే చంద్రుడుని ఫ్యాక్షన్ పాలకులు చీకట్లో నిర్బంధించారు. 7వ తేదీ శనివారం రాత్రి 7.00 గంటల నుంచి 7.05 నిమిషాల వరకూ ఇళ్లలో లైట్లు ఆపి..దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్ లైట్ వెలిగించి..వాహనాల లైట్లు బ్లింక్ చేయడం ద్వారా దార్శనికుడు చంద్రబాబు గారికి సంఘీభావం తెలపండి''. అంటూ ఆయన ట్విటర్ (ఎక్స్) లో వివరించారు.
వైసీపీ విధ్వంస పాలనపై టీడీపీ-జనసేన కలిసి పోరాటం చేస్తాయని టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. టీడీపీ ఎన్డీఏలో చేరుతుందా? లేదా అనేది పార్టీ అధినేత చంద్రబాబు డిసైడ్ చేస్తారని తెలిపారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అవినీతి చేశారంటూ సీఐడీ అధికారులు ఆరోపిస్తున్నారు కానీ, ఏ ఒక్క సీఐడీ అధికారి అధారాలతో నిరూపించలేకపోతున్నారని లోకేష్ ధ్వజమెత్తారు.
స్కిల్ డెవలెప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై తొలిసారిగా సీఎం జగన్ స్పందించారు. అవినీతి కేసులో ఆధారాలతో సహా చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని.. అలాంటి వ్యక్తిని కొందరు కాపాడేందుకు ప్రయ్నతిస్తున్నారంటూ పేర్కొన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కావడం ఏపీ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. బాబు అరెస్ట్ వ్యవహారం బీజేపీకి వ్యతిరేకంగా మలుపులు తిరుగుతోంది. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను కక్షపూరితంగా అరెస్ట్ చేయిస్తోందని విపక్ష నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. మరి చంద్రబాబు ఇండియా కూటమిలో చేరి బీజేపీకి షాక్ ఇవ్వబోతున్నారా..?
తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు రాజమండ్రి సెంట్రల్ జైలులో వాకింగ్, యోగా చేసినట్లు జైలు సిబ్బంది తెలిాపరు. చంద్రబాబుతో ఈరోజు ఆయను కుటుంబ సభ్యులు ములాఖత్ కానున్నారు.