Sajjanar: డ్రైవర్లపై దాడి చేస్తే జైలుకే... సజ్జనార్ వార్నింగ్!
ఆర్టీసీ ఉద్యోగులపై దాడులు చేయడం సరికాదని అన్నారు TSRTC ఎండీ సజ్జనార్. ఎవరైనా దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహాలక్ష్మి పథకం వల్ల సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగిందని.. అయినా చాలా ఓపిక, సహనంతో వారంతా విధులు నిర్వర్తిస్తున్నారని అన్నారు.