Sajjanar: డ్రైవర్లపై దాడి చేస్తే జైలుకే... సజ్జనార్ వార్నింగ్! ఆర్టీసీ ఉద్యోగులపై దాడులు చేయడం సరికాదని అన్నారు TSRTC ఎండీ సజ్జనార్. ఎవరైనా దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహాలక్ష్మి పథకం వల్ల సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగిందని.. అయినా చాలా ఓపిక, సహనంతో వారంతా విధులు నిర్వర్తిస్తున్నారని అన్నారు. By V.J Reddy 10 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి TSRTC MD Sajjanar : సంగారెడ్డి జిల్లా(Sangareddy District) ఆందోల్‌లో ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్న ఘటనలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై బైకర్ దాడి చేశారు. దీనిపై టీఎస్ ఆర్టీసీ(TSRTC) ఎండీ సజ్జనార్(MD Sajjanar) ఘాటుగా స్పందించారు. విధులు నిర్వహిస్తున్న డ్రైవర్ పై దాడులు చేస్తే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఎవరైనా ఆర్టీసీ ఉద్యోగులపై దాడి చేస్తే వారిపై కేసు నమోదు చేస్తామని.. వారు జైలు జీవితం గడపాల్సి వస్తుందని హెచ్చరించారు. ALSO READ: కాంగ్రెస్‌పై ప్రజల్లో తిరుగుబాటు.. ముందుంది అసలు సినిమా.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు ఇది కరెక్ట్ కాదు.. నిబద్దత, క్రమ శిక్షణతో విధులు నిర్వర్తిస్తోన్న టీఎస్ ఆర్టీసీ సిబ్బందిపై ఇలా విచక్షణరహితంగా దాడులకు దిగడం సమజసం కాదని సజ్జనార్ అన్నారు. మహాలక్ష్మి పథకం(Mahalakshmi Scheme) అమలు తర్వాత సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగిందని పేర్కొన్నారు. అయినా చాలా ఓపిక, సహనంతో వారంతా విధులు నిర్వర్తిస్తున్నారని అన్నారు. ఇలాంటి ఘటనలు సిబ్బందిలో ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ లోని ఎంపీడీవో కార్యాలయం వద్ద మంగళవారం మధ్యాహ్నం జరిగిందీ సంఘటన. బైకర్ నిర్లక్ష్యంగా నడపి ప్రమాదానికి కారణమయ్యాడు. అయినా తన తప్పేం లేదన్నట్టు తిరిగి టీఎస్ ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్‌పై దాడి చేశారు. దుర్బాషలాడుతూ విచక్షణ రహితంగా కొట్టారు. సహించేది లేదు.. ఇలాంటి దాడులను యాజమాన్యం అసలే సహించదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై అందోల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ఆవేశంలో సిబ్బందిపై దాడి చేసి అనవసరంగా ఇబ్బందులకు గురికావొద్దని టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తుందని అన్నారు. నిబద్దత, క్రమ శిక్షణతో విధులు నిర్వర్తిస్తోన్న #TSRTC సిబ్బందిపై ఇలా విచక్షణరహితంగా దాడులకు దిగడం సమజసం కాదు. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగింది. అయినా చాలా ఓపిక, సహనంతో వారంతా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనలు సిబ్బందిలో ఆందోళన కలిగిస్తున్నాయి.… pic.twitter.com/juEpeywb74 — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) January 10, 2024 #tsrtc-sajjanar #mahalakshmi-scheme #attack-on-rtc-drivers #free-bus-for-men మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి