Medaram Jatara: రూ.299 చెల్లిస్తే మేడారం ప్రసాదం ఇంటికి!
మేడారం జాతరకు వెళ్లలేని భక్తులకు టీఎస్ఆర్టీసీ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 14 నుంచి 25 వరకు ఆన్లైన్/ఆఫ్లైన్లో అమ్మవార్ల ప్రసాదంతో పాటు పసుపు, కుంకుమను భక్తులకు అందించనుంది. రూ.299 చెల్లించి కార్గో కౌంటర్లలో బుకింగ్ చేసుకోవాలని సూచించింది.