KCR: యాదగిరిగుట్ట మహా కుంభాభిషేకం కార్యక్రమానికి కేసీఆర్‌కు ఆహ్వానం

యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి మహా కుంభాభిషేకం కార్యక్రమానికి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. ఫిబ్రవరి 23న జరగనున్న ఈ కార్యక్రమానికి రావాలని ఆలయ పూజారులు ఆయన్ని కోరారు.

New Update
KCR With Temple Priests

KCR With Temple Priests

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి మహా కుంభాభిషేకం కార్యక్రమానికి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. ఫిబ్రవరి 23న స్వర్ణ విమాన గోపుర మహా కుంభాభిషేకం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆలయ పూజారులు కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. అలాగే మార్చి1 నుంచి 11వ తేదీ వరకు జరగనున్న లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు సైతం హాజరు కావాల్సిందిగా కోరారు. ఈ మేరకు ఎర్రవెల్లి నివాసంలో ఆయనకు ఆహ్వాన పత్రిక అందజేశారు. 

KCR With Temple Priests
KCR With Temple Priests

 

Also Read: అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టా.. నన్ను తేలిగ్గా తీసుకోవద్దు: ఏక్‌నాథ్‌ షిండే

ఈ సందర్భంగా ఆలయ పూజారులు వేద మంత్రాలతో కేసీఆర్‌కు ఆశీర్వచనం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు వెంకటేశ్వరాచార్యులు, డీఈఓ భాస్కర్, ముఖ్య అర్చకులు నరసింహ మూర్తి, కిరణ్ కుమారాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

Also Read: అల్లుడితో అత్త శృంగారం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న మామ.. చివరికి ముగ్గురు కలిసి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు