BIG BREAKING: కాంగ్రెస్లోకి కల్వకుంట్ల కవిత?

కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‍రెడ్డి రంగారెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్‍చాట్ నిర్వహించిన ఆయన మాట్లాడుతూ దానం నాగేందర్, కడియం శ్రీహరి మా పార్టీలోకి వస్తారనుకున్నామా వచ్చారు కదా? ఇప్పుడు కవిత కూడా కాంగ్రెస్‍లో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నారు.

New Update
FotoJet (87)

Will Kalvakuntla Kavitha enter Congress?

Kavitha : తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శాసనమండలి వేదికగా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. తన రాజీనామాను ఆమోదించాల్సిందేనని ఆమె నిండు సభలో పట్టుబట్టడం, మండలి ఛైర్మన్ దాన్ని పునరాలోచించుకోవాలని సూచించడం వంటి పరిణామాలు ఒక పొలిటికల్ థ్రిల్లర్ ను తలపిస్తున్నాయి. అయితే, ఈ రాజీనామా వెనుక కేవలం అసంతృప్తి మాత్రమే ఉందా? లేక దీని వెనుక ఒక భారీ రాజకీయ వ్యూహం దాగి ఉందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీంతో కవిత తీసుకోబోయే రాజకీయ నిర్ణయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. భవిష్యత్‍లో కవిత కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారని ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి. 

శాసనమండలిలో కవిత ప్రవర్తించిన తీరు బీఆర్ఎస్ శ్రేణులను సైతం విస్మయానికి గురిచేసింది. తన రాజీనామా లేఖను ఆమోదించాలని ఆమె ఛైర్మన్ ను కోరగా, తొందరపడవద్దని, నిర్ణయంపై పునరాలోచించుకోవాలని ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. అయినప్పటికీ, కవిత తన నిర్ణయానికి కట్టుబడి ఉంటారా లేక ఛైర్మన్ సూచన మేరకు వెనక్కి తగ్గుతారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. కానీ, సభలో ఆమె బీఆర్ఎస్ పార్టీ విధానాలపై, నాయకత్వంపై పరోక్షంగా నిప్పులు చెరిగిన తీరు చూస్తుంటే.. గులాబీ పార్టీతో ఆమె బంధం తెగిపోయినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇటువంటి తరుణంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‍రెడ్డి రంగారెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత కాంగ్రెస్‍లో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. మంగళవారం మీడియాతో చిట్‍చాట్ నిర్వహించిన మల్‌రెడ్డి రంగారెడ్డి ఈ సందర్భంగా సంచలన కామెంట్స్ చేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి మా పార్టీలోకి వస్తారని అనుకున్నామా వచ్చారు కదా? ఇప్పుడు కవిత కూడా కాంగ్రెస్‍లో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని వ్యాఖ్యానించారు. త్వరలో కవిత సొంత పార్టీ ప్రారంభించబోతున్నారనే ప్రచారం వేళ మల్‍రెడ్డి రంగారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయాంగా ఆసక్తిని రేపుతున్నాయి.

 నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీకే నష్టం : మల్‍రెడ్డి రంగారెడ్డి

మరోవైపు  మంత్రి పదవి ఆశిస్తున్న మల్‍రెడ్డి రంగారెడ్డి ఈ అంశంపై కూడా స్పందించారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీకే నష్టం అన్నారు. నిరాకరిస్తే నాకేం నష్టం లేదు. ఈ విషయంలో పార్టీ పెద్దలు ఆలోచించాలన్నారు. రెండు కోట్ల మంది ప్రజలు ఉన్న రంగారెడ్డి జిల్లాకు ఇంత వరకు మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. ఇక రంగారెడ్డి జిల్లా పేరు మార్పు అనేది ఊహాగానమేనని రంగారెడ్డి జిల్లాలో ఎన్ని మున్సిపాలిటీలు అయినా చేసుకోవచ్చు. కానీ జిల్లా స్వరూపం మారొద్దున్నారు. ఫ్యూచర్ సిటీ పరిసరాల్లో రియల్ భూమ్ పెరిగింది... భూముల రేట్లు పెరుగుతున్నాయని భూములు ఎవరూ అమ్మడం లేదు. ఫార్మాసిటిపై పోరాటం చేసినందుకే గతంలో నన్ను కేసీఆర్ ఓడగొట్టారని కానీ ఫార్మాసిటి వచ్చి ఉంటే 50 కిలోమీటర్ల మేర కాలుష్యం అయ్యేదన్నారు.

Advertisment
తాజా కథనాలు