TS: కాళేశ్వరం కమిషన్ గడువు పొడిగింపు? కాళేశ్వరం కమిషన్ గడువు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్నటితో జస్టిస్ పీసీ ఘోష్ పదవీ కలం ముగిసింది. ఇప్పటికే రెండు సార్లు ఈ కమిషన్‌ను పొడగించారు. మూడోసారి కూడా ఎక్స్టెండ్ చేసే యోచనలో సర్కారు ఉందని తెలుస్తోంది. కాళేశ్వరం మీద విచారణ కీలక దశలో ఉంది. By Manogna alamuru 02 Nov 2024 in తెలంగాణ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Kaleswaram Commission: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన అవకతవకలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించే అవకాశం కనిపిస్తున్నది. ఈ కమిషన్ ప్రస్తుత గడువు నేటితో ముగియనుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఇందుకు సంబంధించిన దస్త్రం ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలనలో ఉందని, మరో రెండు నెలల పొడిగిస్తూ నేడో రేపో ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ కానున్నట్లు తెలుస్తున్నది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఎక్స్‌డెంట్ చేయనున్నట్లు సమాచారం. Also Read: AP: గోదావరి పుష్కరాల తేదీ ఖరారు..ఈసారి ప్రత్యేకతలు ఇవే.. Also Read: Fashion: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ కన్నుమూత ఆఖరి దశలో విచారణ.. కాళేశ్వరం అంశంలో జరిగిన అవకతవకలపై వంద రోజుల్లో నివేదిక ఇవ్వాలని జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ అప్పట్లో నియామక ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. అయితే కమిషన్ ఏర్పాటు చేసిన సమయంలో ఇచ్చిన మొదటి వంద రోజుల గడువు ఈ ఏడాది జూన్ నెలాఖరుతో పూర్తయింది. కానీ విచారించాల్సిన అధికారులు ఎక్కువ మంది ఉండటంతో విచారణ పూర్తి కాలేదు. దాంతో ప్రభుత్వం గడువును ఆగస్టు 31 వరకు పొడిగించింది. ఈ క్రమంలో టెక్నికల్ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడం, విజిలెన్స్, ఎన్డీఎస్ఏ రిపోర్టులు ఆలస్యం కావడంతో మరో రెండు నెలలను పొడిగించింది. ఆ గడువు నేటితో ముగియనున్నది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు ఐఏఎస్‌లను ఓపెన్ కోర్టులో విచారిస్తున్న తరుణంలో విచారణ కీలక దశకు చేరుకున్నది. దీంతో కమిషన్ గడువును మరోసారి పొడిగించాల్సిన అవసరం ఉన్నందున ప్రభుత్వం పెంపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. Also Read: J&K: జమ్మూ–కాశ్మీర్‌లో మళ్ళీ ఉగ్రవాదుల కాల్పులు Also Read: Movies: కూతురు పేరును ప్రకటించిన దీపికా-రణవీర్..అర్ధం ఇదే.. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి