/rtv/media/media_files/2025/08/27/wife-attacks-husbands-house-2025-08-27-15-16-26.jpg)
Wife attacks husband's house
RAMANTHAPUR WIFE DHADI : ఉప్పల్ రామంతపూర్ లో భర్త ఇంటి పై భార్య దాడి చేసింది. 100 మందితో కలిసి భర్త రిత్విక్ రెడ్డి ఇంటి పై భార్య ఆకాంక్ష రెడ్డి దాడి చేసింది. మాట్లాడుకుందాం అని పిలిచి 100 మంది ఇంట్లో దూరి ఇంట్లో ఉన్న ఆడవారిపై దాడి చేశారు. వారిని నిర్బంధించి రూ. 3 కోట్ల 50లక్షలు 4చెక్కుల పై బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని రిత్విక్ రెడ్డి కుటుంబం ఆరోపిస్తోంది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
నూరేళ్లు కలిసి ఉంటామని ఏడడుగులు నడిచిన భార్యాభర్తల మధ్య కొన్నాళ్లుగా మనస్పర్ధలు వచ్చాయి. ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా వేరువేరుగా ఉంటున్నారు. అయితే ఈ విషయంలో మాట్లాడుకుందామని చెప్పిన అమ్మాయి బంధువులు వందమందితో భర్త ఇంటికి వచ్చారు. భర్త కుటుంబంపై కోపంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి భర్త ఇంటిపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతాపూర్‌లో జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం వివరాల్లోకి వెళితే.. రామంతపూర్ ప్రగతి నగర్ కు చెందిన మెతుకుపల్లి రవీందర్ రెడ్డి కుమారుడు రిత్విక్ రెడ్డికి అబ్దుల్లాపూర్ మెట్ గండిచెరువుకు చెందిన రక్తం కృష్ణారెడ్డి కూతురు ఆకాంక్ష రెడ్డితో 2024 ఏప్రిల్ 21న వివాహం జరిగింది. కొద్ది రోజులు సంతోషంగా ఉన్న భార్యాభర్తల మధ్య అనుకోకుండా మనస్పర్ధలు వచ్చాయి. దీంతో పుట్టింటికి వెళ్ళిన ఆకాంక్ష రెడ్డి భర్త రిత్విక్ రెడ్డి పై కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేసింది.
ఈ క్రమంలో పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకోవాలని రెండు కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య ఏర్పడిన సమస్యను పరిష్కరించడానికి కుటుంబ సభ్యులతో రామంతపూర్ ప్రగతి నగర్ లోని భర్త రిత్విక్ రెడ్డి ఇంట్లో చర్చల పేరుతో మాట్లాడుకుందామంటూ వచ్చారు. ఈ మేరకు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టిన ఇరు వర్గాలు సమావేశ మయ్యారు. అయితే పంచాయితీ మధ్యలో వివాదం చెలరేగింది. ఇరువురు మధ్య మాట మాట పెరిగి దాడికి దారితీసింది. 100 మందితో కలిసి భర్త రిత్విక్ రెడ్డి ఇంటి పై భార్య ఆకాంక్ష రెడ్డి కుటుంబం దాడి చేసింది. అనంతరం ఇంట్లోకి అక్రమంగా చొరబడి దాడి చేసి నిర్బంధించి రూ. 3 కోట్ల 50లక్షలు 4చెక్కుల పై బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు. కాగా తన కొడుకు భార్య ఆకాంక్ష రెడ్డి, తండ్రి కృష్ణ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రిత్విక్ రెడ్డి తండ్రి రవీందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఆకాంక్ష రెడ్డి, తండ్రి రొక్కం కృష్ణారెడ్డి, సమీప బంధువు ఎల్బీనగర్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే, బీజేపీ నాయకులు సామ రంగారెడ్డి మరికొందరిపై ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మధు తెలిపారు.
ఇది కూడా చదవండి:AP Mega DSC 2025: ఏపీ మెగా డీఎస్సీలో ఘరానా మోసం .. ఫేక్ సర్టిఫికెట్లతో దొరికిపోయారు!