/rtv/media/media_files/2025/03/14/EcKzRmigW5yemlWQdEId.jpg)
whatsapp video calls Photograph: (whatsapp video calls)
వాట్సాప్‌కు వరల్డ్ వైడ్‌గా బిలియన్ యూజర్లు ఉన్నారు. సైబర్ నేరగాళ్లు అందుకే వాట్సాప్ ద్వారా టార్గెట్ చేస్తున్నారు. వాట్సాప్‌లో వీడియో కాల్ సంబంధిత మోసాలు పెరిగాయి. గుర్తుతెలియని నెంబర్ల నుంచి వీడియో కాల్స్, న్యూడ్ కాల్స్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. యూజర్ల వీడియో రికార్డ్ చేసి సెక్స్‌టార్షన్ ప్రయత్నాలు కూడా ఉన్నాయి. అలాగే స్ర్కీన్ రికార్డ్, స్క్రీన్‌షాట్ తీసి డబ్బులివ్వని బెదిరిస్తుంటారు. వీటన్నింటి చెక్ పెట్టేవిధంగా వాట్సాప్ ఓ ఫీచర్ తీసుకురాబోతుంది.
WhatsApp is testing a feature that lets users answer video calls with their camera off, improving privacy and aligning with platforms like Zoom and Google Meet.#Techinformer #WhatsApp pic.twitter.com/a7NDZdutjV
— Tech Informer (@Tech_Informer_) March 13, 2025
ప్రముఖ ఇన్‌స్టాంట్ మేసేజింగ్ ఫ్లాట్ ఫాం మాతృసంస్థ మెటా వాట్సాప్‌లో ఓ కొత్త అప్‌డేట్ తీసుకురాబోతోంది. వాట్సాప్‌లో సైబర్ సేఫ్టీని పెంచే గేమ్ ఛేంజర్‌గా ఈ అప్‌డేట్ మారునుంది. వాట్సాప్‌లో వీడియో కాల్ లిఫ్ట్ చేయకముందే కెమోరాను కంట్రోల్ చేసే విధంగా ఫీచర్ తీసుకురావాలని వాట్సాప్ ప్రయత్నిస్తోంది. దీంతో అనుమానస్పదంగా ఉన్న వాట్సాప్ వీడియో కాల్స్ ఏవైనా వస్తే వాటిని మన కెమెరా ఆఫ్ చేసి ఆన్సర్ చేయోచ్చు. ఇప్పటి వరకు ఈ ఫీచర్ వాట్సాప్ వీడియో కాల్‌లో లేదు. ఇటీవల నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు ఓ న్యూడ్ కాల్ వచ్చింది. సైబర్‌నేరగాళ్లు ఆయనకు వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేసి బ్లాక్ మెయిల్ చేశారు. డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. ఇలాంటి సైబర్‌నేరగాళ్ల బాధితుల సంఖ్య చాలానే ఉంది. కానీ అందరూ ధైర్యంగా ముందుకు రావడం లేదు. ఓ ప్రజాప్రతినిధికే సైబర్ దాడి తప్పలేదంటే సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ఫేక్ న్యూడ్ కాల్స్, బ్లాక్ మెయిల్ కాల్స్‌కు చెక్ పెట్టే విధంగా వాట్సాప్ ఈ అప్‌డేట్‌ను తీసుకురానుంది.
Also read: కాంగ్రెస్ ఎమ్మెల్యేకు న్యూడ్ కాల్..నిందితులు అరెస్టు!
ఆండ్రాయిడ్ అథారిటీ ప్రకారం.. వాట్సాప్ ఆండ్రాయిడ్ కోసం తాజా బీటా అప్‌డేట్ వెర్షన్ 2.25.7.3లో కొత్త ఆప్షన్‌ను తీసుకురావాలని టెస్ట్ చేస్తోంది. దీని ద్వారా యూజర్లు వాట్సాప్ వీడియో కాల్ ఆన్సర్ చేసే ముందే వారి కెమెరాలను ఆఫ్ చేసుకోవచ్చు. కొత్త అప్‌డేట్‌తో వినియోగదారులు కెమెరా ముందు కనిపించకుండానే వీడియో కాల్‌లను లిఫ్ట్ చేయవచ్చు. దీంతో యూజర్లను స్కామ్ కాల్‌తో ట్రాప్ చేయలేరు. వాట్సాప్ యూజర్ల ప్రైవసీకి, సేఫ్టీకి ఈ అప్‌డేట్ మరో పెద్ద ముందడుగనే చెప్పొచ్చు.
Also read: Jana Sena: జనసేనతో పవనన్న ప్రయాణం ఇదే.. ఒక్కడిగా మొదలై