Local Body Elections : జీవో 46 అంటే ఏమిటి? 2030లో వచ్చే ఎన్నికలకే బీసీ రిజర్వేషన్?

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం జారీ చేసిన అత్యంత ప్రాధాన్యమైన ఆదేశాల్లో జీవో 46 ఒకటి.  రాష్ట్రంలోని స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని స్పష్టంగా పేర్కొంటూ ప్రభుత్వం ఈ జీవోను విడుదల చేసింది.

New Update
Local body Election

Local Body Elections

Local Body Elections : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం జారీ చేసిన అత్యంత ప్రాధాన్యమైన ఆదేశాల్లో జీవో 46 ఒకటి.  రాష్ట్రంలోని స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని స్పష్టంగా పేర్కొంటూ ప్రభుత్వం ఈ జీవోను విడుదల చేసింది.తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవో 46 ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలిపి గరిష్టంగా 50 శాతం వరకు మాత్రమే ఉండాలి. రిజర్వేషన్ కేటాయింపులో పూర్వపు 2019 రోస్టర్ తప్పనిసరిగా అనుసరిస్తూ స్థానిక జనగణన ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించాలి. రిజర్వేషన్లలో అవసరమైన మార్పుల కోసం డెడికేటెడ్ కమిటీ సిఫార్సులు పాటించాలి.


సుప్రీంకోర్టు, హైకోర్టు పలుమార్లు ఇచ్చిన తీర్పుల ప్రకారం, స్థానిక సంస్థల రిజర్వేషన్లు 50 శాతం మించి ఉండరాదు. తెలంగాణలో గతంలో కొన్ని ప్రాంతాల్లో రిజర్వేషన్లు అధికంగా ఉండటంపై కోర్టులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం జీవో 46ను ప్రవేశపెట్టింది. ఎన్నికల సమయంలో ఈ జీవో ప్రాధాన్యత కలిగిస్తుంది. రాబోయే పంచాయతీ ఎన్నికలు మాత్రమే పాత రిజర్వేషన్‌ ప్రకారం నిర్వహించి మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో మాత్రం 42 శాతం రిజర్వేషన్‌ కోసం కోర్టులో పోరాడుతామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అది సాధ్యం కాదన్నది అందరికీ తెలిసిన విషయమే. దీంతో 2019 నాటి పద్దతిలోనే ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరి. ఈ సందర్భంగా రిజర్వేషన్లు కేటాయించే ప్రక్రియలో జీవో 46 కీలకం. మండలాలు, గ్రామాలలో ఎవరికి రిజర్వేషన్ వస్తుంది?ఎవరికి జనరల్ సీటు వస్తుంది? అన్నది ఈ జీవో ద్వారా నిర్దేశించిన ప్రమాణాల ఆధారంగానే ఉంటుంది.

2019 పంచాయతీ ఎన్నికల పూర్వపు రోస్టర్

ప్రస్తుతం ప్రభుత్వం పాత రిజర్వేషన్లతోనే అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు వివరిస్తోంది. 2019 పంచాయతీ ఎన్నికల సమయంలో అమలులో ఉన్న రిజర్వేషన్ రోస్టర్‌నే తిరిగి వర్తింప చేస్తారని ఈ జీవో చెపుతుంది. 

పూర్వపు రోస్టర్ అంటే ఏమిటి...?

2018–2019 సంవత్సరంలో పంచాయతీ రాజ్ శాఖ విడుదల చేసిన రిజర్వేషన్ రోస్టర్ ఆ సమయంలో జారీ చేసిన జీవో ఎం. ఎస్. నెంబర్: 10, 11, 12, 13 (ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఉమెన్స్ రిజర్వేషన్ల కేటాయింపులు) అని అర్ధం. అదే రోస్టర్‌ ప్రకారం ప్రస్తుత ఎన్నికల్లో సైతం పాత రిజర్వేషన్ నే కొనసాగిస్తారు.

ఎందుకు 2019 రోస్టర్‌కే ప్రాధాన్యం?

2024 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రిజర్వేషన్ల పరిశీలన కోసం డెడికేటెడ్ కమిటీ ఏర్పాటు చేసినా, ఆ ప్రక్రియ ఆలస్యంతో నివేదిక పూర్తి కాలేదు. కోర్టుల ఆదేశాల ప్రకారం, రిజర్వేషన్లు అప్డేట్ చేయడానికి సమయం పట్టడంతో,ఎన్నికలు వాయిదా పడకుండా ఉండేందుకు పాత రోస్టర్‌ను కొనసాగిస్తున్నారు. పూర్వపు 2019 పంచాయతీ రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం జరిపిన విధానమే ప్రస్తుత 2024–25 లోనూ వర్తింప చేస్తోంది.

పాత రిజర్వేషన్లపై కొత్త ఎన్నికల సన్నాహాలు

పంచాయతీ రాజ్ శాఖ 2019 లో జారీ చేసిన జీవో ఎం. ఎస్. నెంబర్ : 10, 11, 12, 13 (ఎస్సి, ఎస్టీ, బీసీ, ఉమెన్స్ రిజర్వేషన్లు) ఆధారంగా రిజర్వేషన్ కేటాయింపులు జరిగాయి.అదే రోస్టర్‌ను 2025 సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా మార్చకుండా ఉపయోగించబోతున్నారు. కోర్టుల సూచనల ప్రకారం రిజర్వేషన్లు శాస్త్రీయంగా చేయాల్సి ఉండాల్సి ఉండగా, బీసీ రిజర్వేషన్లపై సేకరించిన డేటా,సర్వే పూర్తికాలేదు. గవర్నర్ ఆమోదానికి పంపిన రెండు సార్లు ఆర్డినేన్స్ అమలుకు నోచుకోలేదు. వరుసగా ఒకే రిజర్వేషన్ రెండు సార్లు అనే నిబంధనలు సవరణ (GO 46 సంబంధిత అంశం) పెండింగ్‌లో ఉన్నది. అందువల్ల పాత 2019 రోస్టర్‌ ప్రకారం ఎన్నికలు కొనసాగించక తప్పడం లేదు.

సిద్ధమైన ఎన్నికల టైమ్‌లైన్

ఈ నెల 26న సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకానుంది. డిసెంబర్ 11,14,17తేదీల్లో మూడు విడతలుగా పోలింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. సోమవారం పాత రోస్టర్‌ ఆధారంగా గ్రామాల వారీగా రిజర్వేషన్ల కొత్త జాబితా విడుదలకు పంచాయతీ అధికారులు సిద్ధమవుతున్నారు.

ఈ పద్ధతి ఎవరికి లాభం?

2019 రోస్టర్‌ను కొనసాగించడం రాజకీయంగా ఎవరికి రాజకీయ లబ్ది చేకూరుస్తుందోనని విశ్లేషణ సాగుతోంది. కాగా కొత్తగా రిజర్వేషన్ మార్పులు లేవని తెలిసినందున, గ్రామ స్థాయిలో ఎన్నికల్లో పోటీకి రంగం సిద్ధం అయ్యింది.

జీ.ఓ 46పై తెరలేపిన ప్రభుత్వం, స్థానిక ఎన్నికల్లో కీలక మలుపు

తెలంగాణ పంచాయతీ ఎన్నికల వేళ మరోసారి జీ.ఓ 46 చర్చకు కేంద్రబిందువైంది. రిజర్వేషన్ల కేటాయింపులో కీలకమైన ఈ ఆదేశం 2021లో వెలువడినప్పటికీ, దాని అమలు ఇప్పటి వరకు నిలిచిపోయింది. కొత్త రిజర్వేషన్ రోస్టర్‌ విడుదలకు ముందు తీసిన ఈ జీ.ఓ 46ను అమల్లోకి తీసుకొస్తారా? లేక పాత విధానమే కొనసాగుతుందా? అన్న ప్రశ్నలపై రాజకీయ వర్గాల్లో భారీ చర్చ జరుగుతోంది.

జీ.ఓ 46 అంటే ఏమిటి...?

పంచాయతీరాజ్ శాఖ 2021లో జారీ చేసిన జీవో ఎం. ఎస్. నెంబర్ : 46 ప్రకారం ఒకే రిజర్వేషన్ రెండు సార్లు వరుసగా అమల్లో ఉండవచ్చని ఈ జీవో సైతం చెపుతుంది. ఒక గ్రామం 2019లో ఎస్సీ మహిళగా రిజర్వ్ అయిందంటే, తదుపరి ఎన్నికల్లో కూడా అదే ఎస్సి మహిళగా రిజర్వేషన్ కొనసాగించవచ్చని ఈ జీవో చెప్తుంది.

జీ.ఓ 46 ఎందుకు వివాదాస్పదం?

రాజ్యాంగంలోని 243D ప్రకారం రిజర్వేషన్లు “రోటేషన్ పద్ధతిలో” ఉండాలని సాధారణ అభిప్రాయం. దీనికి భిన్నంగా, ప్రభుత్వం వరుస రిజర్వేషన్లు అనుమతించాలనుకోవడంతో, జీ.ఓ 46 న్యాయపరమైన పరీక్షను ఎదుర్కొనే ఆస్కారం ఉంది. గవర్నర్ ఆమోదం అవసరమైన సవరణ చట్టం పెండింగ్‌లో ఉండడం, బీసీ డేటా, సామాజిక జనాభా సర్వే లెక్కలు ప్రభుత్వం పూర్తిగా చెప్పకపోవడం ప్రస్తుత రిజర్వేషన్ కి అడ్డంకి అయింది. 
ఈ కారణాల వలన జీ.ఓ 46 ఎప్పుడూ అమల్లోకి రాలేదని న్యాయ నిపుణుల అభిప్రాయం. స్థానిక ఎన్నికల వేళలో ప్రభుత్వం సమయాభావంతో జీ.ఓ 46ను ఇచ్చినప్పటికి ఇది అమలు చేయకుండా, పాత 2019 రోస్టర్‌నే కొనసాగించనుంది.

డెడికేటెడ్ కమిటీ నివేదిక ఆలస్యం

బీసీ రిజర్వేషన్ పెంపు అంశం ఫైనల్ కాకపోవడం, గవర్నర్ ఆర్డినేన్స్ ఆమోదం, చట్ట సవరణలు లేక పోవడం, డెడికేటెడ్ కమిటీ నివేదిక ఆలస్యం వల్ల జీ.ఓ 46 పూర్తిగా నిలిపి వేయబడుతుంది. జీ.ఓ 46 అమలైతే ఎవరికి లాభమనే  రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం,అధికారంలో ఉన్న పార్టీకి లాభం జరుగుతుందని అంటున్నారు. గత ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఉన్న రిజర్వేషన్లు వరుసగా కొనసాగితే  గత సర్పంచ్‌గా పనిచేస్తున్న నాయకులకు లాభం ఉంటుందని బావిస్తున్నారు. వారి పాలన పరమైన వ్యతిరేకత ఇప్పుడు కొత్తగా వచ్చే పోటీ దారులకి, అధికార పార్టీకి లాభం జరిగే అవకాశం ఉంది. అదే రిజర్వేషన్ తిరిగి వస్తే, అక్కడ పోటీ చేసి గతంలో ఓడిపోయిన వారికి  సానుభూతితో తిరిగి గెలిచే వీలు ఉంటుంది. బలమైన బీసీ, ఓసీ ఆధారిత గ్రామాల్లో రిజర్వేషన్ మార్పు లేకుండా ఉంటుందని అనిపిస్తుంది. దీనితో అభ్యర్థుల పొలిటికల్ లెక్కలన్నీ ముందుగానే స్పష్టమవుతాయి. 2019 రోస్టర్‌లో ఎలాంటి రిజర్వేషన్ వచ్చిందో అదే రిజర్వేషన్ 2025 సర్పంచ్ ఎన్నికల్లో కూడా కొనసాగడం వల్ల గ్రామాల్లో పోటీ సమీకరణాలు మారకపోవడంతో, అనేక చోట్ల ఇప్పటికే అంతర్గత సర్దుబాట్లు మొదలయ్యాయి.

 తెలంగాణలో ప్రస్తుతం వేసిన ఈ కమిటీ రానున్న 2030లో గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. రిజర్వేషన్ల పునర్వ్యవస్థీకరణ, కొత్త రోస్టర్ తయారీ, సామాజిక సమూహాల శాతసంఖ్యలను తిరిగి అంచనా వేయడం వంటి కీలక ప్రక్రియలు ఈ కమిటీ పరిధిలోకి వస్తాయి. తెలంగాణలో అన్ని స్థానిక సంస్థల రిజర్వేషన్లను పూర్తిగా కొత్తగా సమీక్షించడం, గ్రామ పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అన్నింటిలో ఎస్సి, ఎస్టీ బీసీ, ఉమెన్స్ రిజర్వేషన్లను సైంటిఫిక్ బేసిస్ మీద పునర్నిర్వహించడమే కమిటీ ప్రధాన పని. అలాగే జనాభా ఆధారాలు, సామాజిక శాతంపై కొత్త డేటా సేకరణ, బీసీ, ఎస్సి, ఎస్టీ జనాభా శాతం 2011 సెన్సస్ ఆధారంతో, తాజా సామాజిక, ఆర్థిక గణాంకాలు, గ్రామాల జనాభా మార్పులు, బీసీల అసలు శాతం తెలపడం, వీటి నివేదికలు తిరిగి అంచనా వేసి సరికొత్త రిజర్వేషన్ల లెక్కలు తేల్చడం జరుగుతుంది.

రిజర్వేషన్ల రోస్టర్‌ను పూర్తిగా కొత్తగా రూపొందించడం, ప్రతి గ్రామం, ప్రతి వార్డు, ప్రతి మున్సిపల్ డివిజన్‌కు ఎవరికి రిజర్వేషన్ ఇవ్వాలి?, ఎక్కడ రోటేషన్ పెట్టాలి?, ఎక్కడ రిజర్వేషన్ మార్చాలి?, ఏ గ్రామాలు వరుసగా ఒకే రిజర్వేషన్‌కి అర్హత ఉండాలి. వీటన్నింటిని విభాగాలవారీగా నిర్ణయించే శక్తి ఈ డెడికేటెడ్ కమిటీకి ఉంది. కోర్టుల ఆదేశాల ప్రకారం శాస్త్రీయ పద్ధతిలో రిజర్వేషన్ నిర్మాణం, హైకోర్టు, సుప్రీంకోర్టు సూచనలు పాటిస్తూ బీసీ రిజర్వేషన్ బిల్లు ఆర్డినేన్స్ ఆమోదం అయిన వాటిలో వచ్చే రిజర్వేషన్లు, సైంటిఫిక్ బేసిస్ మీద ఉండేలా కమిటీ చూస్తుంది.
రాజకీయ ప్రయోజనాలకు ప్రభావితం కాకుండా డికేటెడ్ కమిటీ ఈ ప్రమాణాలకు అనుగుణంగా చట్టపరమైన రిస్క్ లేకుండా కొత్త రిజర్వేషన్ రోస్టర్ తయారు చేయాలి. ఆర్డినేన్స్ అమలులోకి వస్తే కొత్త చట్టం సవరణలకు సిఫార్సు చేయడం, బీసీ రిజర్వేషన్ పెంపు, రెండు సార్లు వరుసగా ఒకే రిజర్వేషన్ నిబంధనలు, గ్రామాల గణాంక మార్పులకు అనుగుణంగా కొత్త రూల్స్, మార్పులన్నింటిపై ప్రభుత్వానికి సిఫార్సులు చేసి పంపడం కమిటీ పనిలో ఒక ప్రధానమైన భాగం.

డెడికేటెడ్ కమిటీ ప్రస్తుతం ఆయా పనులు ప్రారంభించినప్పటికీ ఫీల్డ్ డేటా సేకరణ ఆలస్యం అయింది. బీసీ జనాభా అంచనా స్పష్టంగా రాకపోవడం, గవర్నర్ వద్ద పెండింగ్ ఉన్న సవరణల బిల్లు, న్యాయపరమైన చిక్కుల కారణంగా కమిటీ ఫైనల్ రిపోర్ట్ ఇవ్వడంలో ఆలస్యం అవుతుంది. కాగా పాత 2019 రోస్టర్‌తోనే ఎన్నికలు జరపడం అనివార్యం అయింది.

Advertisment
తాజా కథనాలు