/rtv/media/media_files/2025/11/26/kavitha-2025-11-26-21-56-40.jpg)
Kalvakuntla Kavitha
Former MLC Kavitha : తెలంగాణలో రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన ప్రకటన చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి అభ్యర్థులు బరిలోకి దిగుతారని ఈ సందర్భంగా తెలిపారు. అయితే ఏ గుర్తుపై పోటీ చేస్తామనేది ఇప్పుడే వెల్లడించలేమని ఆమె చెప్పారు. ఈ ప్రకటనతో స్థానిక సంస్థల ఎన్నికల వేళ క్షేత్రస్థాయి రాజకీయాలు మరింత హీట్ ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది. బీఆర్‌ఎస్‌తో విభేదించి బయటకు వచ్చిన కవిత గత కొంతకాలంగా దూకుడుగా ఉన్నారు. తెలంగాణ జాగృతిని త్వరలోనే రాజకీయ పార్టీగా రిజిస్ట్రేషన్ చేయించేందుకు ప్రయత్నిస్తు్న్నారు. ఈ క్రమంలోనే మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో అలిండియా ఫార్వర్డ్ బ్లా్‌క్ గుర్తుపై పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కొంతమంది విజయం కూడా సాధించారు.
ఈ క్రమంలోనే త్వరలో జరగబోయే పురపాలక సంఘ ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణ జాగృతి నిర్ణయించడం సంచలనంగా మారింది. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావడానికి మరో 3 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో మున్సిపాలిటీ ఎన్నికల్లో మాదిరిగానే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో.. ఆల్‌ఇండియా ఫార్వర్డ్ బ్లాక్‌కు చెందిన సింహం గుర్తుతో పోటీ చేయడమా మరో మార్గా్న్ని అనుసరించడం అనే విషయంలో కవిత కొంత సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలిచిన వారిలో కొంతమంది తమకు కవితకు సంబంధం లేదని ప్రకటించడంతో గందరగోళం నెలకొంది. కాగా గద్వాలలో ఫార్వర్ట్ బ్లాక్ అభ్యర్థులు వడ్డేపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకున్నప్పటికీ వారంతా కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమవ్వడం చర్చనీయంశంగా మారింది. ఈ క్రమంలో రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అలిండియా ఫార్వర్డ్ బ్లాక్‌తో వెళ్లడమా లేక ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగడమా అనే విషయంలో జాగృతి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అందుకే ఏ గుర్తుపై పోటీ చేస్తామనేది ఇప్పుడే వెల్లడించలేమని కవిత పేర్కొనడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీసింది.
Follow Us