భూపాలపల్లిలో హనుమాన్ విగ్రహం దగ్ధం.. భయాందోళనలో గ్రామస్థులు

భూపాలపల్లి జిల్లాలో విస్తుపోయే ఘటన చోటుచేసుకుంది. అంబటిపల్లి గ్రామంలోని అమరేశ్వర ఆలయంలో హనుమాన్ విగ్రహం దగ్దమైంది. దీంతో గ్రామా ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలో పడ్డారు. ఇది దుష్టశక్తుల పనా లేదా ప్రమాదవశాత్తు జరిగిందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

temple11

hanuman idol burnt

New Update

Bhupalapalli District :  తెలుగు రాష్ట్రాల్లో వరుసగా దేవాలయాల పై దాడులు జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవలే ఏపీలోని చిత్తూరు జిల్లాలో మొలకల చెరువు దగ్గర ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరవకముందే మరో ఆలయంలో విగ్రహం ధ్వంసమైంది. 

Also Read: నవ్వులు పూయిస్తున్న 'సారంగపాణి జాతకం' టీజర్‌.. ప్రియదర్శి కామెడీ టైమింగ్ అదుర్స్

Also Read: భారత్‌లో లంచాలు..యూఎస్‌లో కేసులు ఎలా?అదానీని కావాలనే టార్గెట్ చేస్తున్నారా?

హనుమాన్ విగ్రహం దగ్ధం 

భూపాలపల్లి జిల్లా అంబటిపల్లి గ్రామంలో విస్తుపోయే ఘటన చోటుచేసుకుంది. అమరేశ్వర ఆలయంలో హనుమాన్ విగ్రహం దగ్దమై కనిపించింది. దీంతో గ్రామస్తులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు..  విగ్రహ దగ్ధం దుష్టశక్తుల పనా..ఆకతాయిలు చేశారా? లేదా ప్రమాదవశాత్తు జరిగిందా? అనే కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. మరో వైపు గ్రామస్థులు విగ్రహం మంటల్లో కాలడం ఊరికి అరిష్టమంటూ భయపడుతున్నారు. 

Also Read: Allu Arha: నా 8ఏళ్ల ఆనందం.. కూతురు బర్త్‌డే సందర్భంగా అల్లు అర్జున్ విషెస్‌ వైరల్‌!

Also Read: ఆర్జే వెంచర్స్‌ రూ.150 కోట్ల బిగ్ స్కామ్.. 600 మందిని మోసం చేసిన కంపెనీ

#hanuman #amareshwara-temple #bhupalapalli-district
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe