Nizamabad: గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగలపై పోలీసుల ప్రత్యేక దృష్టి
బోధన్ పట్టణంలోని ఆదివారం గణేష్ ఉత్సవ నిర్వాహకులతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి DCP S.జై రామ్, విశిష్ఠ అతిథిగా ఇంచార్జ్ ఏసీపీ రవీందర్రెడ్డి పాల్గొన్నారు. గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ రవీందర్రెడ్డి మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబీ శాంతి యుతంగా జరుపుకోని.. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు.