కాంగ్రెస్ MLA వసూళ్ల దందా.. సీక్రెట్ కెమెరాకు చిక్కిన తుంగతుర్తి ఎమ్మెల్యే

కాంగ్రెస్ ఎమ్మెల్యే వసూళ్ల దందా సీక్రెట్ కెమెరాకు చిక్కింది. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ లిక్కర్ సిండికేట్‌ నిర్వాహకుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది.

New Update

కాంగ్రెస్ ఎమ్మెల్యే వసూళ్ల దందా సీక్రెట్ కెమెరాకు చిక్కింది. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ లిక్కర్ సిండికేట్‌ నిర్వాహకుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. అయితే ఆ వీడియోలో ఎమ్మెల్యే మందుల సామెల్ తనకు మామూళ్లు ఇవ్వాలంటూ బెదిరింస్తున్నాడు. మీరిచ్చే మామూల్లు నా టీ ఖర్చులకు సరిపోవని, రోజుకు లక్ష ఖర్చు అవుతోందని ఆయన వీడియోలో బాధితులకు చెబుతున్నారు.

ప్రభుత్వం ఇచ్చే జీతం ఎటూ సరిపోవట్లేదని.. డీజిల్‌కు కూడా డబ్బులు లేవని మందుల సామెల్ లిక్కర్ సిండికేట్ నిర్వాహకుల దగ్గర చెబుతున్నారు. ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టాను. వాటిని పదవిలో ఉన్నప్పుడు రాబట్టాలి కాదా అని మామూళ్లు అడుగుతున్నారు. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదని వారితో అన్నారు. దేశంలో ఎవడయా సంసారి, ఎవడయా సుద్ధపూస బాధితులను డబ్బులు డిమాండ్ చేశారు. నా మాట వినని వాని సంగతి చూస్తా అని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ బెదిరిస్తూన్నారు. ఇదంతా సీక్రెట్ కెమెరాలో రికార్డ్ అయ్యింది. దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియో చెక్కర్లు కొడుతుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు