Uttam Kumar Reddy: అధిష్ఠానంపై అలిగిన ఉత్తమ్.. మంత్రి పదవి బిస్కెట్

మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పార్టీ అధిష్ఠానంపై అలిగినట్లు తెలుస్తోంది. తన భార్య పద్మావతికి మంత్రి అడగగా.. దీనికి హైకమాండ్ ఒప్పుకోలేదు. దీంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. రాహుల్‌గాంధీతో సమావేశం జరగగా.. 20 నిమిషాల్లోనే ఆయన బయటికొచ్చారు.

New Update

తెలంగాణ రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పార్టీ అధిష్ఠానంపై అలిగినట్లు తెలుస్తోంది. తన భార్య పద్మావతికి మంత్రి అడగగా.. దీనికి హైకమాండ్ ఒప్పుకోలేదు. దీంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు పార్టీ కోసం కృషి చేసిన తమకు మరో మంత్రి పదవి కావాలని ఉత్తమ్ అడిగినట్లు సమాచారం. ఢిల్లీలో రాహుల్‌గాంధీతో సమావేశం జరగగా.. 20 నిమిషాల్లోనే ఉత్తమ్ కుమార్‌ బయటికి వచ్చేశారు.    

Also Read: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి 7 కొత్త రూల్స్.. లిస్ట్ ఇదే!

 తాను చెప్పిన వాళ్లకి మంత్రి పదవులు ఇవ్వలేదని ఆయన అలిగినట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫ్యామిలీకి రెండు మంత్రి పదవులు ఇవ్వడంపై కూడా అసంత-ృప్తితో ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదం తెలిపింది. ఏప్రిల్ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు బీసీలు, అలాగే ఒక రెడ్డి, ఎస్సీకి మంత్రివర్గంలో స్థానం లభించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఏఐసీసీ.. రాష్ట్ర కోర్‌ కమిటీ నుంచి వివరాలు తీసుకుంది. అయితే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్ నుంచి అభిప్రాయాలను సేకరించింది. 

Also Read: పోలీసుస్టేషన్‌ లోనే భర్త ముఖం పగలకొట్టిన ఇంటర్నేషనల్‌ బాక్సింగ్‌ ఛాంపియన్!

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్‌రెడ్డిలో ఒకరికి మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉంది. ఇక బీసీలో ఆది శ్రీనివాస్‌, శ్రీహరి ముదిరాజ్‌కు రానుంది. ఎస్సీలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా రాష్ట్రంలో ఆరు మంత్రి స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో నాలుగైదు భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మైనార్టీలకు ఛాన్స్ ఇస్తే ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్‌కు చోటు దక్కే ఛాన్స్ ఉంది.  

Also Read: భారతీయ గ్రీన్ కార్డుదారులకు ఇక చుక్కలు చూపించనున్న ట్రంప్ కొత్త పాలసీ విధానం!

 rtv-news | telugu-news | uttam-kumar-reddy | telangana | congress

Advertisment
తాజా కథనాలు