మరికొన్ని గంటల్లో గ్రూప్-1 పరీక్ష.. సీఎం రేవంత్‌కు బండి సంజయ్ సంచలన లేఖ

సోమవారం నుంచి గ్రూప్-1 పరీక్షలు జరగనున్న నేపథ్యంలో కేంద్రమంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్‌కు బహిరంగ లేఖ రాశారు. పంతాలు, పట్టింపులకు పోకుండా 29 జీవోను ఉపసంహరించుకోవాలని తెలిపారు. గ్రూప్ 1 పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని కోరారు.

New Update
Bandi sanjay

సోమవారం నుంచి గ్రూప్-1 పరీక్షలు జరగనున్న నేపథ్యంలో కేంద్రమంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్‌కు బహిరంగ లేఖ రాశారు. పంతాలు, పట్టింపులకు పోకుండా 29 జీవోను ఉపసంహరించుకోవాలని తెలిపారు. '' రేపు పరీక్షలని తెలిసి కూడా ఈరోజు ఆందోళనను కొనసాగిస్తున్నారంటే అర్థం చేసుకోండి. నిరుద్యోగులంతా మీ కుటుంబ సభ్యులుగా భావించి వారి ఆవేదనను అర్థం చేసుకోండి. గ్రూప్ 1 పరీక్షలను రీషెడ్యూల్ చేయండి. 29జీవో వల్ల గ్రూప్ 1 పరీక్షల్లో 5003 మంది ఎస్సీ,ఎస్టీ,బీసీ అభ్యర్థులు అనర్హలయ్యారు. 563 పోస్టులకు గుండుగుత్తగా 1:50 చొప్పున అభ్యర్థులను ప్రకటించడం అన్యాయం. ఈ మొత్తం పోస్టుల్లో 354 రిజర్వ్ పోస్టులు ఉన్నాయి. 29 జీవో వల్ల ఓపెన్ కేటగిరిలో అర్హత సాధించిన రిజర్వ్ అభ్యర్థులను సైతం రిజర్వ్ కేటగిరీలో చేర్చడం అన్యాయం. 

Also Read: వణికిస్తున్న బాంబు బెదిరింపులు.. ఎయిర్ లైన్స్‌కి ఎంత నష్టమంటే?

ఈ జీవోవల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యర్థులు 1:50 చొప్పున అర్హత సాధిస్తే.. ఓసీ వర్గాలు 1:65 శాతం మేరకు అర్హత సాధించారు. జీవో నెంబర్ 29 రాజ్యాంగ స్పూర్తికి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ కు వ్యతిరేకం. గ్రూప్ 1 అభ్యర్థులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. గ్రూప్ 1 పరీక్షలను రీషెడ్యూల్ చేయకుంటే ఆత్మహత్యే శరణ్యమని వాపోతున్నారు. 29 జీవో వల్ల రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్ల వ్యవస్థనే రద్దు చేయబోతున్నారనే చర్చ మొదలైంది. తక్షణమే 29 జీవోను ఉపసంహరించుకోవాలని'' బండి సంజయ్ కోరారు. 

Also Read: సరికొత్త స్కానర్.. వ్యాధుల గుర్తింపు మరింత ఈజీగా..

ఇదిలాఉండగా అక్టోబర్ 21 అంటే సోమవారం నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసందే. ఈ పరీక్షలను వాయిదా వేయాలని ఇటీవల గ్రూప్‌ 1 అభ్యర్థులు అశోక్‌ నగర్, అలాగే సచివాలయం వద్ద పెద్దఎత్తున ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఈ గ్రూప్-1 పరీక్షలో రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను పాటించలేదని.. జీవో 29ను రద్దు చేసి పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి పరీక్షలు వాయిదా వేయడం కుదరని చెప్పేశారు. యథావిధిగా పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు. 

Also Read: బయటపడ్డ మరో బాబా రాసలీలలు.. వీడియో వైరల్

వివాదం ఏంటీ 

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రూప్‌-1 నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు జీవో 55ను తీసుకొచ్చారు. దీని ప్రకారం.. ఒక ఉద్యోగానికి రిజర్వేషన్ సహా అన్ని కేటగిరీల నుంచి 50 మందిని ఎంపిక చేస్తారు. మిగతా రిజర్వుడ్ పోస్టులకు ఆయా అభ్యర్థులకే అవకాశం కల్పిస్తారు. రిజర్వుడ్ అభ్యర్థులకు వారి కోటాతోపాటు ఓపెన్ కోటాలోనూ ఉద్యోగం పొందేందుకు అవకాశం ఉంటుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జీవో 29ను తీసుకొచ్చింది. 

జీవో 29 ప్రకారం ఓపెన్ కోటాలో రిజర్వుడ్ అభ్యర్థులకు ఉద్యోగం పొందే అవకాశం ఉండదు. మెరిట్ ర్యాంకు వచ్చినా కూడా ఈ కోటాలో ఛాన్స్ ఉండదు. కేవలం రిజర్వుడు కోటాలో మాత్రమే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ జీవో వల్ల ఇలా రిజర్వుడు అభ్యర్థులకు ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం లభించే అవకాశం లేకపోవడం.. కేవలం రిజర్వుడు కోటా మాత్రమే ఉండటం వల్ల కాస్త తక్కువ ర్యాంకు వచ్చే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని అంటున్నారు. అందుకే జీవో 29ను రద్దు చేసి రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

Also Read: జైల్లో లారెన్స్ బిష్ణోయ్ ఖర్చులకు రూ.40 లక్షలు.. ఎవరు ఇస్తున్నారంటే?

Advertisment
Advertisment
తాజా కథనాలు