Bandi Sanjay:
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పెద్ద సహాయమే చేశారు. రోడ్డు ప్రమాదానికి గురైన ఓ యువతిని స్వయంగా రంగంలోకి దిగి కాపాడారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ ఆమెను తన సొంత కాన్వాయ్‌లో ఆసుపత్రికి పంపించారు. సకాలంలో వైద్య సహాయం అందేలా తక్షణ చర్యలు చేపట్టారు. ఫలితంగా ఆ యువతి కోలుకుంటోంది.
Also Read: Aviation : 17 ఏళ్లలో ఐదింటి కథ ముగిసింది..విమానయాన రంగం కుదేలు!
మానుకొండూరుకు చెందిన దివ్యశ్రీ అనే మహిళ సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదానికి గురైంది. స్కూటీపై వెళ్తోన్న ఆమెను ఓ భారీ లారీ అదుపు తప్పి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆమె ఆ లారీ ముందు చక్రాల కిందికి వెళ్లిపోయింది. ఎడమ టైర్ కింద పడింది. ఈ విషయాన్ని గమనించిన వెంటనే లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు.
Also Read: పెళ్లింట విషాదం నింపిన ప్రమాదం..వధువు అన్న,స్నేహితురాలి దుర్మరణం
ఈ ఘటనలో ఆమె తల వెంట్రుకలు చక్రాల్లో చిక్కుకుపోయాయి. దీనితో ఎటూ కదల్లేని స్థితికి చేరుకుంది. స్థానికులు ఆమెను కాపాడటానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. అదే సమయంలో అటుగా ములుగు వెళ్తోన్న బీజేపీ నేత బండి సంజయ్.. ఈ విషయాన్ని గమనించారు. వెంటనే తన కాన్వాయ్‌ని అక్కడే నిలిపివేశారు. తాను స్వయంగా కారు దిగి లారీ వద్దకు వెళ్లి ఆమె పరిస్థితి చూశారు. జాకీ ద్వారా లారీని పైకి ఎత్తి.. టైర్‌లో చిక్కుకున్న తలవెంట్రుకలను విడదీయాలంటూ లారీ డ్రైవర్, క్లీనర్‌ను ఆదేశించారు. తీవ్ర భయాందోళనలకు గురైన ఆ యువతికి ధైర్యం చెప్పారు. సురక్షితంగా కాపాడుతానంటూ భరోసా ఇచ్చారు.
Also Read: TGఉపాధ్యాయ ఉద్యోగాల ఎంపికలో గందరగోళం...విధుల నుంచి మరో యువతి తొలగింపు!
సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. ఆమెను కాపాడేంత వరకూ అక్కడే ఉన్నారు. సుమారు అరగంట పాటు బండి అక్కడే ఉన్నారు. ఈ ప్రమాదం వల్ల రోడ్డుకు ఇరు వైపులా వాహనాల రాకపోకలు స్తంభించిపోగా.. వాటినికూడా బండి సంజయ్ నే స్వయంగా క్లియర్ చేశారు.
Also Read: Srisailam: శ్రీశైలం ఆలయంలో డ్రోన్ కలకలం..అదుపులో ఇద్దరు వ్యక్తులు
ఆమెను వెలికి తీసిన తరువాత కారులో ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యాన్ని అందించాలంటూ డాక్టర్లకు ఫోన్ చేసి చెప్పారు. చికిత్సకు సంబంధించిన అన్ని విషయాలను తనకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని అన్నారు.