/rtv/media/media_files/2025/08/13/hyderabad-heavy-rains-2025-08-13-15-52-31.jpeg)
Hyderabad Heavy Rains
Heavy Rain : మరోసారి హైదరాబాద్‌ను భారీ వర్షం ముంచెత్తింది. ఆదివారం రాత్రి వర్షం దంచికొట్టింది. గంట వ్యవధిలోనే ఏకంగా 12 సెం.మీ వర్షపాతం నమోదైంది. రికార్డ్ స్థాయిలో కురిసిన భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. ఈ క్రమంలోనే ఆసిఫ్ నగర్లో ఇద్దరూ వరదలో గల్లంతయ్యారు. అఫ్జల్ సాగర్ మంగారు బస్తీలోని నాలాలో మామ అల్లుడు కొట్టుకుపోయారు. మామను కాపాడే ప్రయత్నంలో అల్లుడు కూడా గల్లంతయ్యాడు. వీరిద్దరి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. నాలాలో గల్లంతైన మామ అల్లుళ్ల కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఓ వైపు వర్షం.. మరోవైపు చీకటి పడటంతో రెస్క్యూ ఆపరేషన్ ఇబ్బందిగా మారింది. అప్జల్ సాగర్ నాలా దాటుతుండగా మామ అందులో పడిపోయాడు. ఆయనను కాపాడే ప్రయత్నంలో అల్లుడు కూడా అందులో పడిపోయినట్లు సమాచారం. గల్లంతైన ఇద్దరూ 30 సంవత్సరాలు లోపు వారేనని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చూడండి:Nepal: నేపాల్ తాత్కాలిక ప్రభత్వ సారథిగా సుశీలా కర్కి ప్రమాణం
అలాగే, ముషీరాబాద్‌లో మరో యువకుడు నాలాలో కొట్టుకుపోయినట్లు తెలిసింది. ముషీరాబాద్ డివిజన్ వినోబా కాలనీకి చెందిన సన్నీ (26) అనే యవకుడు రాత్రి 9.30 గంటల సమయంలో స్థానికంగా ఉన్న నాలా పక్కన ఉన్న గోడపై కూర్చుని స్నేహితులతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా గోడ కూలిపోయింది. దీంతో ఆ యువకుడు నాళాలో పడి కొట్టుకుపోయాడు. వెంటనే అతని స్నేహితులు తాడుతో రక్షించేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సంఘటన స్థలానికి హైడ్రా, జీహెచ్ఎంసీ, పోలీసు సిబ్బంది వచ్చి గల్లంతైన వ్యక్తి కోసం చర్యలు చేపట్టారు. స్థానిక యువకులు పెద్ద ఎత్తున నాలా ప్రవాహం వైపు కర్రలు, తాళ్లతో సన్నీ ఆచూకీ కోసం ప్రయత్నాలు చేపట్టారు.
ఇది కూడా చదవండి: ఎంతకు తెగించార్ర...శ్మశానవాటికలో ఆ పని...పోలీసులు షాక్
మరోవైపు, షేక్‌పేట, రాయదుర్గం, రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, అమీర్‌పేట, ముషీరాబాద్, రామ్‌నగర్, తార్నాక, ఎల్బీనగర్, కాచిగూడ, కుషాయిగూడ, కాప్రా, కీసర తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. వర్షం నీటితో వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంజారాహిల్స్‌లో జలమయమైన రహదారులను అధికారులతో కలిసి జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి పరిశీలించారు.