Warangal : వరంగల్‌లో వర్షం బీభత్సం.. వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సులు

వరంగల్‌ జిల్లాలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది.  ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో మిల్స్‌కాలనీ, శివనగర్, పోచమ్మ మైదాన్ అండర్ బ్రిడ్జి ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.

New Update
warangal

వరంగల్‌ జిల్లాలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది.  ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో మిల్స్‌కాలనీ, శివనగర్, పోచమ్మ మైదాన్ అండర్ బ్రిడ్జి ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. అండర్ బ్రిడ్జ్ వైపు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు అధికారులు.  

వరదలో ఆర్టీసీ బస్సులు

వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జి కిందికి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఆ మార్గంలో వెళ్లిన రెండు ఆర్టీసీ బస్సులు వరద నీటిలో చిక్కుకున్నాయి. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు ప్రాణభయంతో కేకలు వేశారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో వెంటనే  మిల్స్ కాలనీ పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తాడు సాయంతో బస్సుల్లో ఉన్న ప్రయాణికులను బయటికి తీసుకొచ్చారు. అన్నారం, మహబూబాద్‌ నుంచి వచ్చిన ఈ బస్సుల్లో దాదాపుగా వంద మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటన అనంతరం ఆ మార్గాన్ని పోలీసులు క్లోజ్ చేశారు. 

ఈ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం, బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రానున్న రోజుల్లో కూడా రాష్ట్రంలో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కొత్తగూడెం, మెదక్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, కామారెడ్డి వంటి జిల్లాలకు 'ఎల్లో అలర్ట్' జారీ చేయబడింది. ప్రజలు వర్షం కురిసే సమయంలో అనవసరంగా బయటకు రాకుండా ఉండాలని సూచించారు.

Also Read : Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజన్ 9.. ప్రారంభంలోనే ఎలిమినేషన్.. ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున

Advertisment
తాజా కథనాలు