/rtv/media/media_files/2025/04/04/3Qc9uYkSD3DeW3dvDwah.jpg)
TSBIE Telangana Board Academic Calendar 2025-26 OUT
తెలంగాణ ఇంటర్ బోర్డు (Telangana Inter Board) తాజాగా రాష్ట్రంలో జూనియర్ కాలేజీల 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ బోర్డు క్యాలెండర్‌ను రిలీజ్ చేసింది. అందులో కాలేజీ పనిదినాలు, తరగతులు, సెలవులు(Inter Holidays), ఎగ్జామ్స్ షెడ్యూల్‌ను వెల్లడించింది. ఇందులో భాగంగానే గురువారం ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య కొత్త అకడమిక్ క్యాలెండర్‌ను (New academic calendar) రిలీజ్ చేశారు.
Also Read: మనుషులులేని దీవులపై కూడా ట్రంప్ టారిఫ్ ఛార్జీల మోత.. ఎందుకంటే?
ఈ ఏడాది జూన్ 2 నుంచి ఇంటర్ కళాశాళలు మొదలు అవుతాయని ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. అప్పటి వరకు సమ్మర్ హాలిడేస్ అని తెలిపారు. అందువల్ల ఏవైనా కాలేజీలు ఈ వేసవి సెలవుల్లో క్లాస్‌లు నిర్వహింస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంటర్ బోర్డు ఆదేశాలు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు వర్తిస్తాయని తెలిపారు.
Also Read: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!
ఇందులో భాగంగానే ఈ సారి ఇంటర్ తరగతులు మొత్తం 226 రోజుల పాటు ఉండనున్నాయి. అంతేకాకుండా జూనియర్ కళాశాళలకు 77 రోజులు సెలవులు రానున్నాయి. 2026 ఫిబ్రవరిలో ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. మార్చి నెలలో పబ్లిక్ ఎగ్జామ్స్ జరగనున్నాయి.
Also Read: నటిపై గృహ హింస కేసు.. హైకోర్టును ఆశ్రయించిన హన్సిక!
అకడమిక్ క్యాలెండర్ ప్రకారం..
దసరా సెలవులు: 2025 సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు కాలేజీలకు సెలవులు.
ఆఫ్ ఇయర్ ఎగ్జామ్స్ : 2025 నవంబర్ 10 నుంచి 15 వరకు ఇంటర్ ఆఫ్ ఇయర్ పరీక్షలు
సంక్రాంతి సెలవులు: 2026 జనవరి 11 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు.
ప్రాక్టికల్స్: 2026 ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ఉంటాయి.
ఫైనల్ పరీక్షలు: 2026 మార్చిలో ఇంటర్ వార్షిక పరీక్షలు జరుగుతాయి.
Also Read: టర్కీలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 200మంది భారతీయులు 16 గంటలుగా
వేసవి సెలవులు: 2026 ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు సమ్మర్ హాలీడేస్ ఉంటాయి.
తరగతులు ప్రారంభం: 2026 జూన్ 1 నుంచి ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం తరగతులు మళ్లీ పున:ప్రారంభం అవుతాయి.
(telangana-inter-board latest-telugu-news)