కిషన్ రెడ్డి కాదు.. కిస్మత్ రెడ్డి.. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సెటైర్లు-VIDEO

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ఓ కిస్మత్ రెడ్డి అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సెటైర్లు వేశారు. కేంద్రమంత్రిగా రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పాలన్నారు. HCU భూముల్లో పారిశ్రామిక ప్రగతి, అభివృద్ధి జరిగితే యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు.

New Update

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని అనుకోవడం పగటి కల అని టీపీసీసీ చీఫ్‌ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కిస్మత్ రెడ్డి అసలు పేరు కిషన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. 25 ఏళ్ల రాజకీయ జీవితంలో  అంబర్ పేట నియోజకవర్గానికి ఆయన ఏం చేశారో చెప్పాలన్నారు. కిషన్ రెడ్డి మగాడు అయితే రాష్ట్రానికి ఏం చేసిండో చెప్పే దమ్ముందా? అని ధ్వజమెత్తారు. నిధుల సంగతి దేవుడురేగు.. కనీసం ప్రధానిని కలిసి రాష్ట్ర అభివృద్ధి గురించి ఒక్కసారైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. ఎన్నిక‌లు రాగానే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య ప్రేమ చిగురించ‌డం ప‌రిపాటిగా మారిందన్నారు. ఎన్నికలు అయిపోగానే శత్రువుల్లా డ్రామాలు ఆడుతారన్నారు. మీలాగా ర‌హ‌స్య ప్రేమ‌ను న‌డ‌ప‌డం తమ పార్టీకి అల‌వాటు లేదన్నారు.

అక్బరుద్దీన్, కిషన్ రెడ్డి అన్నదమ్ములు..

కిషన్ రెడ్డి పొద్దున లేస్తే అక్బరుద్దీన్ ఓవైసీ జపం చేస్తాడన్నారు. గత జన్మలో ఇద్దరు అన్నదమ్ములు అనుకుంటా అని సెటైర్లు వేశారు.  బీజేపీ నేతలకు మతంపై తప్పా.. అభివృద్ధిపై ధ్యాస లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రజాకార్ల రాజ్యం ఎందుకు వస్తుందో కిస్మత్ రెడ్డికి తెలియాలన్నారు. కేంద్ర మంత్రిగా దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. సంఖ్యాబ‌లం లేని మీరు ఎవ‌రి ప్రేమ, అండ‌దండ‌లు చూసుకుని పోటీ చేస్తున్నారని బీజేపీ నేతలను ప్రశ్నించారు.

తమకు సంఖ్యా బ‌లం లేదు కాబట్టే ఎన్నిక‌ల‌కు దూరంగా ఉన్నామన్నారు. రాజకీయ అవసరాలను బట్టి స్థానిక ఎన్నికల్లో మద్దతు గురించి ఆలోచిస్తామన్నారు. మెట్రో రైలు విస్తరణకు మీకు పట్టదా? అని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు.. నగర ఎంపీగా సహాయ సహకారాలు అందించాల్సి ఉండగా.. ఎందుకు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. HCU భూముల్లో పారిశ్రామిక ప్రగతి, అభివృద్ధి జరిగితే యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. బీసీ బిడ్డలైన ఈటల రాజేందర్, బండి సంజయ్ 42 శాతం రిజర్వేషన్ల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఫలానా వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వాలని జానారెడ్డి అనలేదన్నారు. ఆయన అందరి హితం కోరే వ్యక్తి అని అన్నారు. 

(tpcc | telugu-news | telugu breaking news | kishan-reddy)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు