/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
తెలంగాణలో మూడో విడుత ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగింది. భోజన విరామం తర్వాత పోలింగ్ అధికారులు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. ముందుగా వార్డు మెంబర్ల ఓట్లు లెక్కిస్తున్నారు. ఆ తర్వాత సర్పంచ్ ఓట్లను కౌంట్ చేయనున్నారు. ఫలితాల తర్వాత వార్డు వెంబర్లుగా గెలిచిన అభ్యర్థులు ఉప సర్పంచ్‌ను ఎన్నుకోనున్నారు. ఇక మూడో విడతలో మొత్తం 4159 సర్పంచ్ స్థానాలకు 395 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 287, బీఆర్‌ఎస్ 42, బీజేపీ 9, ఇతరులు 57 స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Follow Us