Atrocious : జగిత్యాలలో దారుణం ... ఆస్తికోసం అన్నను చంపిన చెల్లెళ్లు

ఆస్తులు, డబ్బు, అంతస్తుల నీడన అత్మీయతలు, అనుబంధాలు కనుమరుగవుతున్నాయి. అన్న, చెల్లె, తమ్ముడు, అక్క అనే బంధాలు కానరానివవుతున్నాయి. దీంతో మనిషనేవాడు మాయమై, మానవత్వం మంటగలిసి ఆస్తి కోసం అన్నాచెల్లెల్లు, అన్నదమ్ములు ఒకరినొకరు  కొట్టుకుని చంపుకుంటున్నారు.

New Update
Murder

Murder

Atrocious :  ఆస్తులు, డబ్బు, అంతస్తుల నీడన అత్మీయతలు, అనుబంధాలు కనుమరుగవుతున్నాయి. అన్న, చెల్లె, తమ్ముడు, అక్క అనే బంధాలు కానరానివవుతున్నాయి. దీంతో మనిషి అనేవాడు మాయమై, మానవత్వం మంటగలిసి మారణహోమానికి దారితీస్తోంది. ఆస్తి కోసం అన్నాచెల్లెల్లు, అన్నదమ్ములు ఒకరినొకరు  కొట్టుకుని చంపుకుంటున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి తెలంగాణలో చోటు చేసుకుంది. ఆస్తి కోసం ఇద్దరు అక్కాచెల్లెల్లు అన్నను కొట్టి చంపారు. ఈ ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో జరిగింది.

Also Read: మైనర్‌ బాలికలు శృంగారం చేస్తే తప్పుకాదు.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!

జగిత్యాల జిల్లా కేంద్రం  పోచమ్మ వాడలో ఉండే జంగిలి శ్రీనివాస్‌ అతని చెల్లెళ్లు శారద, వరలక్ష్మిల మధ్య కొంతకాలంగా ఆస్తిపరమైన విషయాల్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పలుమార్లు ఘర్షణ పడ్డారు. కాగా ఆస్తి తగదాలతో ఇటీవల అన్నపై ఇద్దరు చెల్లెళ్లు శారద, వరలక్ష్మి కర్రలతో దాడి చేశారు. దీంతో తీవ్ర గాయాలైన జంగిలి శ్రీనివాస్ ను అతని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనవాస్ ఈరోజు (ఫిబ్రవరి 23) న  మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులిద్దరు  పట్టణ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. కాగా ఆస్తికోసం అన్నను చంపిన చెల్లెళ్లపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: New Ration Cards: కొత్త రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్.. మంత్రి కీలక ప్రకటన!

Also Read: తెలంగాణలో కొత్త లిక్కర్ బ్రాండ్స్..ఎప్పటినుంచంటే...

Also Read: మవోలకు మరో దెబ్బ.. భారీ డంప్ స్వాధీనం.. పోలీసుల చేతికి కీలక సమాచారం!

Advertisment
Advertisment
తాజా కథనాలు