/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/work-jpg.webp)
Mahatma Gandhi NREGA
Mahatma Gandhi NREGA : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనిదినాల్లో కేంద్ర ప్రభుత్వం భారీగా కోత విధించింది. ఉపాధి కోసం కూలీలు వలసలు వెళ్లకుండా, ఆకలి చావులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే, కేంద్రప్రభుత్వం పలు నిబంధనలు, మార్గదర్శకాల పేరిట ఈ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తు్న్నదన్న విమర్శలు వస్తున్నాయి.2025-26 ఆర్థిక సంవత్సరానికి 12 కోట్ల పనిదినాలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా.. 6.5 కోట్ల పనిదినాలనే కేంద్రం మంజూరు చేసింది. నిరుడు 8 కోట్ల పనిదినాలు మంజూరు చేయగా.. ఈసారి అందులో 1.5 కోట్లు తగ్గించింది. డిమాండ్ ఆధారంగా కాకుండా అవసరాల ప్రాతిపదికన పనులు చేపట్టాలంటూ రాష్ట్రానికి రాసిన లేఖలో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గత ఐదు సంవత్సరాల ఉపాధి హామీ పనిదినాలను పరిశీలిస్తే ఏనాడూ 12 కోట్లకు తక్కువగా నమోదు కాలేదు.
Also Read: BIG BREAKING: మహేష్ బాబుకు ఈడీ నోటీసులు.. రియల్ ఎస్టేట్ కంపెనీల కుంభకోణంలో బిగ్ షాక్!
ఇంత తక్కువగా పనిదినాలను ఏనాడూ కేటాయించలేదని, కేంద్రం తీరు ‘ఉపాధి హామీ’ని నిర్వీర్యం చేసేలా ఉందని గ్రామీణాభివృద్ధి, ఉపాధి హామీ నిపుణులు, సంఘాలు ఆరోపిస్తున్నాయి. కూలీలు వలస పోకుండా రూపొందించిన కార్యక్రమాన్ని నిధులకు ముడి పెట్టి ఏదో ఒక రకంగా పనిదినాలను, బడ్జెట్‌ను తక్కువగా కేటాయించకోవడమే ప్రధాన అంశంగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ వ్యవహరిస్తుందని విమర్శలు వస్తున్నాయి. ఉపాధి హామీ కింద నాలుగేళ్లుగా రాష్ట్రంలో పెద్దఎత్తున పనులు చేపట్టారు. కేంద్రం ఏటా 8 కోట్ల చొప్పున పనిదినాలు మంజూరు చేస్తుండగా.. వాటికన్నా ఎక్కువ పనులు జరుగుతున్నాయి. 2021-22లో 10 కోట్లు, 2022-23లో 10 కోట్లు, 2023-24లో 11 కోట్లు, 2024-25లో 12 కోట్ల పనిదినాలు పూర్తి చేశారు. ఈ ఏడాది మాత్రం పనిదినాలను కేంద్రం 6.5 కోట్లకే పరిమితం చేయడంతో పాటు తాము నిర్దేశించిన పనులే చేయాలని ఆంక్షలు విధించింది. నిరుడు పలు జిల్లాల్లో వంద శాతానికి మించి పనులు జరగడాన్ని అనుమానించిన కేంద్ర ప్రభుత్వం... రాష్ట్రానికి ప్రత్యేక బృందాలను పంపి క్షేత్రస్థాయి తనిఖీలు చేయించింది. పలుచోట్ల నిబంధనలకు విరుద్ధంగా పనులు చేశారని గుర్తించింది. ఈ నేపథ్యంలోనే పనిదినాలను తగ్గించినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Paster praveen: పోలీసులకు వ్యతిరేకంగా KA పాల్ అనుమానాలు.. ఆర్టీవీతో ఎక్స్‌క్లూసివ్ వీడియో
Mahatma Gandhi NREGA
గతంలో మాదిరిగా డిమాండ్‌కు అనుగుణంగా పనిదినాలు పెంచబోమని కేంద్రం తెలిపింది.కేటాయించిన పని దినాల ప్రకారమే పనులు చేయించాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. ‘డిమాండ్ డ్రివెన్ గా కాకుండా.. సప్లై డ్రివెన్’గా ఉపాధిహమీ పనులు కొనసాగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డిమాండ్‌ను బట్టి పనిదినాలను కేంద్రం పెంచకపోతే..రాష్ట్రంలో ఉపాధి ఆధారిత పనిదినాలు త్గగుతాయని, దీంతో కూలీలపై ఆ ప్రభావం స్పష్టంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. పనిదినాలను పెంచేలా కేంద్రానికి లేఖ రాసే యోచనలో మంత్రి సీతక్క ఉన్నట్లుగా సమాచారం.
Also Read: Ap-Telangana: బీ అలర్ట్...7 రోజులపాటు వర్షాలు..!
కేంద్రం కేటాయించిన పనిదినాలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.8.57 కోట్ల పనిదినాలు కేవలం ఏప్రిల్, మే నెలల్లోనే పూర్తి అయ్యాయి. కానీ, కేంద్రం ఈ ఏడాది మొత్తానికి కేవలం 6.5 కోట్ల పనిదినాలను మాత్రమే కేటాయించింది. ఈ నేపథ్యంలో కేంద్రం కేటాయించిన పని దినాలతోనే 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జిల్లాల వారీగా ఉపాధి హమీ పనులు, నిధులు, వర్క్ ప్లాన్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ ఫైల్ పై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సోమవారం సంతకం చేశారు. ఉపాధీ హమీ పథకం కోసం 2025–26 ఏడాదిలో మొత్తం రూ. 2,708 కోట్ల నిధులు మంజూరు చేశారు. జిల్లాల వారీగా చేపట్టే పనుల కార్యచరణను ఇప్పటికే సిద్ధం చేశారు. ఇందులో రూ.1,625 కోట్ల వేతనాలు, రూ.1,083 కోట్ల మేర మెటీరియల్ కంపోనెంట్ నిధులను ప్రతిపాదించారు. ఉపాధి హమీ పనుల కింద మహిళా శక్తి, ఉపాధి భరోసా, పొలం బాట, ఫల వనాలు, వనమహోత్సవం, జల నిధి, రూరల్ సానిటేషన్, మౌళిక సదుపాయాల కల్పన పనులు చేపట్టనున్నారు. ప్రభుత్వం జిల్లాల వారీగా చేపట్టే పనులకు మంత్రి ఆమోదం తెలిపారు.
Also Read: Trump Vs Harvard: ట్రంప్ ప్రభుత్వంపై హార్వర్డ్ దావా
పనిదినాలను కుదించడంతో పాటు పనులపై ఆంక్షలు విధించడంపై రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో రహదారులు, గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు ఉపాధి నిధులను వినియోగిస్తున్నారు. ఈసారి కొత్తగా చేపల కొలనుల నిర్మాణం చేపట్టింది. పనులను కుదిస్తే వాటన్నింటిపైనా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమిలేని వ్యవసాయ కూలీల గుర్తింపునకు 100 రోజుల పాటు పనిచేసేవారిని రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటోంది. దీంతో పనులకు వస్తున్న కూలీలు పెరుగుతున్నారు. కొత్తగా జాబ్‌కార్డులు ఇవ్వాలంటూ పెద్దసంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పనిదినాలు పెంచాలంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క యోచిస్తున్నారు. మరోవైపు, కేంద్రం కేటాయింపులకు అనుగుణంగా జిల్లాలవారీగా చేపట్టే పనులపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కార్యాచరణ ప్రణాళిక విడుదల చేసింది. ఈ ఏడాది మహిళా శక్తి ఉపాధి భరోసా, పొలం బాటలు, ఫల వనాలు, వనమహోత్సవం, జల నిధి, గ్రామీణ పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టాలని నిర్ణయించింది. వేతనాలకు రూ.1,625 కోట్లు, మెటీరియల్ కంపోనెంట్‌కు రూ.1,083 కోట్ల మేర నిధులు మంజూరు చేస్తూ దస్త్రంపై మంత్రి సీతక్క సంతకం చేశారు.
Also Read: Trump Vs Harvard: ట్రంప్ ప్రభుత్వంపై హార్వర్డ్ దావా
mgnrega | mgnrega-wage | mahatma-gandhi | mgnrega payment details