/rtv/media/media_files/2025/10/04/tgsrtc-2025-10-04-20-17-25.jpg)
TGSRTC
బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీకి మొత్తం రూ.110 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. ఈ విషయాన్ని యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది పండుగల సందర్భంగా 7,754 స్పెషల్ బస్సులు నడపాలని ముందుగా నిర్ణయించినప్పటికీ.. ఆశించినంత ప్రయాణికులు లేకపోవడం వల్ల 5300 మాత్రమే ప్రత్యేక బస్సులను పరిమితం చేసినట్లు తెలిపింది. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేశామని అధికారులు వెల్లడించారు.
Also Read: మావోయిస్టులతో చర్చలు జరిపేదే లేదు.. తేల్చిచెప్పిన అమిత్‌షా
గతేడాది కూడా ఇదే సీజన్‌లో 6300 ప్రత్యేక బస్సులు నడిపించారు. అప్పుడు రూ.114 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సొంతూర్లకు వెళ్లినవాళ్ల సంఖ్య తగ్గింది. ఈసారి ప్రైవేటు వాహనాలను ఎక్కువగా వినియోగించినట్లు అధికారులు భావిస్తున్నారు. ఇక తిరుగు ప్రయాణానికి సంబంధించి అక్టోబర్ 5, 6 తేదీల్లో కూడా రద్దీకి తగ్గట్లు స్పెషల్ బస్సులు నడిపించాలని ఆర్టీసీ నిర్ణయించింది.
Also Read: సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..స్పాట్‌లో ఇద్దరు..