GROUP-3: తెలంగాణలో గ్రూప్-3 అభ్యర్థులకు బిగ్ అలర్ట్. గ్రూప్-3 పరీక్షల హాల్ టికెట్స్ ను తాజాగా టీజీపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్స్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్ కాపీని భద్రంగా పెట్టుకోవాలని, తొలిరోజు పేపర్-1 పరీక్షకు హాజరైన హాల్‌టికెట్‌ను మిగతా పరీక్షలకు ఉపయోగించాలని తెలిపింది. ప్రశ్నపత్రాలు, హాల్‌టికెట్లను నియామక ప్రక్రియ ముగిసేవరకు భద్రంగా పెట్టుకోవాలని పేర్కొంది.
Also Read: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ ప్రాంతాల్లో నీళ్లు బంద్
17, 18 తేదీల్లో....
ఈ నెల 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షను TGPSC నిర్వహించనుంది. ఈ నెల 17న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష జరగనుండగా... అదే రోజు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరగనుంది. కాగా రెండు రోజు అంటే ఈ నెల 18న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-3 పరీక్ష నిర్వహించనుంది. ఈ పోస్టులకు 5.36 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం జరిగే పరీక్షలకు 9.30 తర్వాత, మధ్యాహ్నం జరిగే పరీక్షకు 2.30 అనంతరం పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని ఇటీవల టీజీపీఎస్సీ స్పష్టం చేసింది.
Also Read: ట్రంప్ గెలవడానికి మీరే కారణం..మీతో సెక్స్ చేయం-యూఎస్ మహిళలు
పెరిగిన ఖాళీలు..
మొదట 1363 పోస్టులతో 2022 డిసెంబర్ 30వ తేదీన TSPSC Group 3 నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ పోస్టులకు బీసీ గురుకుల సొసైటీలో ఖాళీగా ఉన్న 12 పోస్టులను అదనంగా చేర్చడంతో మొత్తం పోస్టుల సంఖ్య 1375కి పెరిగింది. అనంతరం నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ కార్యాలయంలో 13 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది. దీంతో మరోసారి 13 పోస్టులు కలపడంతో మొత్తం కొలువుల సంఖ్య 1,388కి పెరిగాయి.
Also Read: ట్రంప్ గెలుపు...అమెరికాకు గుడ్ బై చెబుతున్న హాలీవుడ్ హీరోయిన్లు
Also Read: రేవంత్ సర్కార్ కు షాక్.. కులగణనపై ప్రజల్లో వ్యతిరేకత!