TGPSC GROUP-1: ముదురుతున్న వివాదం.. మరోసారి గ్రూప్‌-1 వాయిదా!?

తెలంగాణలో మరోసారి గ్రూప్-1 వివాదం ముదరుతోంది. మరో వారం రోజుల్లో మెయిన్స్ పరీక్షలు జరగనుండగా వాటిని రీ షెడ్యూల్‌ చేయాలంటూ పలువురు అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. పాత నోటిఫికేషన్ ప్రకారమే నియామకాలు చేపట్టాలని హెచ్చరిస్తున్నారు.

New Update
Group 1: గ్రూప్ 1 అభ్యర్థులకు అలెర్ట్.. ఓఎంఆర్‌ పద్ధతిలో ప్రిలిమ్స్

TGPSC GROUP-1: తెలంగాణలో మరోసారి గ్రూప్-1 వివాదం ముదరుతోంది. మరో వారం రోజుల్లో మెయిన్స్ పరీక్షలు జరగనుండగా వాటిని వాయిదా వేయాల్సిందేనంటూ పలువురు అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని రేవంత్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. 

G.O.55 ప్రకారమే పరీక్షలు..

ఈ మేరకు G.O. 29 రద్దు చేసి, పాత G.O.55 ప్రకారమే పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థులు తమ డిమాండ్లను లేవనెత్తుతున్నారు. పాత నోటిఫికేషన్‌లోని 503 పోసుల్లో కొత్త అభ్యర్థులకు అవకాశం ఇవ్వొద్దని నిరసనలు చేపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన 60 పోస్టుల్లో  మాత్రమే కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు ప్రిలిమ్స్‌లో తప్పుల్ని సవరించి, రిజర్వేషన్లపై కోర్టుల్లో పెండింగ్ కేసుల్ని తేల్చాలంటున్నారు. పాత నోటిఫికేషన్ ప్రకారమే రిజర్వేషన్లు, ఓపెన్ కేటగిరి ఉండాలని ప్రభుత్వం ముందు డిమాండ్స్ పెడుతున్నారు. 

ఇది కూడా చదవండి: Samantha : మరోసారి కొండా సురేఖకు సమంత కౌంటర్! ఏమందో తెలిస్తే షాకే

మెయిన్స్ రీ షెడ్యూల్‌..

గత ప్రభుత్వంలో పేపర్ లీక్‌తో ఇప్పటికే పలు మార్లు గ్రూప్-1 రద్దు కాగా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఏడాది 2024 ఫిబ్రవరి 22న నోటిఫికేషన్ విడుదల చేయగా 563 పోస్టులకు జూన్ 9న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. మొత్తం 3.02 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో మెయిన్స్‌కు 31,382 మంది అర్హత సాధించారు. ఇందులో భాంగానే అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం షెడ్యూల్ రిలీజ్ చేసింది. అయితే గ్రూప్-1 మెయిన్స్ రీ షెడ్యూల్‌ చేయాలని అభ్యర్థుల డిమాండ్ చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: Bhumi Pednekar : బ్లూ చీరలో 35 ఏళ్ల నటి అందాల జాతర.. ఈ హాట్ బేబీ లుక్స్ చూస్తే అంతే సంగతి

సీఎస్ శాంతి కుమారి కీలక ప్రకటన..

ఇదిలా ఉంటే.. తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలపై సీఎస్ శాంతి కుమారి కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 21నుంచి 27వరకు జరిగే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను ఏవిధమైన పొరపాట్లు లేకుండా అత్యంత పకడ్బందీగా నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, సంబంధిత ఉన్నతాధికారులతో గురువారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ మీటింగ్ లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ కార్యాలయం నుండి కమీషన్ చైర్మన్ డా. మహేందర్ రెడ్డి, సభ్యులు పాల్గొనగా.. సచివాలయం నుండి డీజీపీ జితేందర్, కమీషన్ కార్యదర్శి నవీన్ నికోలస్, SPDCL MD ముష్రాఫ్ అలీ, రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కర్ణన్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు అనుదీప్, శశాంక్, గౌతమ్ తదితర అధికారులు హాజరయ్యారు. 

ఇది కూడా చదవండి: 12 ఏళ్ళ తర్వాత తల్లి కాబోతున్న బాలయ్య హీరోయిన్.. బేబీబంప్ ఫొటోలు వైరల్

ఇది కూడా చదవండి: అడివి శేష్ సినిమా నుంచి తప్పుకున్న శృతిహాసన్.. కారణం అదే

 

Advertisment
Advertisment
తాజా కథనాలు