Tg RTC: కార్తీక మాసం సందర్భంగా తెలంగాణలోని భక్తులకు టీజీఎస్ ఆర్టీసీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో ఉన్న ప్రసిద్ధ శైవ క్షేత్రాలకు భక్తుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. శ్రీశైలం, వేములవాడ, ధర్మపురి, కీసరగుట్టతో పాటు పలు దేవాలయాలకు హైదరాబాద్ నుంచి స్పెషల్ బస్సులను నడుపుతున్నట్టు చెప్పారు. ఆర్టీసీ పనితీరు, కార్తీకమాసం ఛాలెంజ్, శబరిమల యాత్రలు, మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు సౌకర్య పథకం, తదితర అంశాలపై హైదరాబాద్ బస్ భవన్ నుంచి శనివారం వర్చువల్‌గా ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని సజ్జనార్ నిర్వహించారు.
Also Read: రైలు ఢీకొని నలుగురు పారిశుద్ధ్య కార్మికులు మృతి!
భక్తుల రద్దీ అధికంగా...
ఆర్టీసీకి కార్తీక మాసం, శబరిమల యాత్రలు ఎంతో ముఖ్యమని ఇలాంటి సందర్భంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సజ్జనార్ సూచించారు. ఆది, సోమవారాలు శైవక్షేత్రాలకు భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. అందుకు అనుగుణంగా అధికారులు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచాలని సూచించారు.
Also Read: విశ్వమిత్రగా భారత్...విదేశాంగ మంత్రి జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ నెల 15న కార్తీక పౌర్ణమి నేపథ్యంలో తమిళనాడులోని అరుణాచలానికి ప్రత్యేక ప్యాకేజీని అందిస్తున్నామని ప్రకటించారు. అలాగే.. ఆంధ్రప్రదేశ్‌లోని పంచారామాలకు ప్రతి సోమవారం ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. ఈ ప్రత్యేక బస్సుల్లో http://tgsrtcbus.in వెబ్‌సైట్‌లో ముందుగానే రిజర్వేషన్ చేసుకోవాలన్నారు.
Also Read: కెనడా ఇక ఆపదా..సైబర్ ముప్పు దేశాల జాబితాలో భారత్ పేరు
మరిన్నీ వివరాలకు ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాలన్నారు. బస్ ఆన్ కాంట్రాక్ట్ (బీవోసీ) ఛార్జీలు తగ్గింపు..అద్దె ప్రాతిపదికన ఆర్టీసీ బస్సు ఛార్జీలను తగ్గించినట్లు సజ్జనార్ తెలిపారు. పల్లె వెలుగు కిలోమీటర్‌కు రూ.11, ఎక్స్ ప్రెస్ రూ.7, డిలక్స్ రూ.8, సూపర్ లగ్జరీ రూ.6, రాజధాని రూ.7 మేర తగ్గించినట్లు తెలిపారు. శబరిమలకు, శుభముహుర్తాలకు అద్దెకు ఆర్టీసీ బస్సులను బుకింగ్ చేసుకుని.. క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సజ్జనార్ అన్నారు.
Also Read: కేదర్‌నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి ఆలయాలు మూసివేత