India: విశ్వమిత్రగా భారత్...విదేశాంగ మంత్రి జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు

భారతదేశం విశ్వమిత్రగా ఎదుగుతోందని విదేశాంగమంత్రి ఎన్. జైశంకర్ వ్యాఖ్యలు చేశారు. వీలైనంత ఎక్కువ మందితో..ఎక్కువ దేశాలతో స్నేహం చేయాలనుకుంటోందని అన్నారు. కెనడాతో దౌత్య వివాదాలు ఎదుర్కొంటున్న వేళ ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

New Update
Jai shankar

N. jai shankar: 

భారత్‌ నేడు విశ్వమిత్రగా ఎదుగుతోందని..వీలైనంత ఎక్కువ మందితో సత్ససంబంధాలు ఏర్పరుచుకోవాలని అభిప్రాయపడుతోందని అన్నారు విదేశాంగ మంత్రి ఉఎన్. జైశంకర్. ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలను చేశారు. అయితే  అంతర్జాతీయ వేదికపై కొంతమంది స్నేహితులు క్లిష్టంగా ఉండొచ్చు. మనం అనుకున్నట్టు వారు అనుకోకపోవచ్చును. పరస్పర గౌరవం, దౌత్యపరమైన మర్యాద వంటివి చూపించకపోవచ్చును. అయినా కూడా భారత్ సంయమనం వహించాలని చూస్తోంది. భారత్ ఎప్పుడూ శాంతి మార్గానికే అనుకూలంగా ఉందని జైశంకర్ చెప్పారు. భారత అంతర్గత వ్యవహారాలపై బయట దేశస్థులు మాట్లాడుతున్నారు. భాగస్వాములను విశ్లేషించే విషయంలో సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తాయని జైశంకర్ చెప్పుకొచ్చారు. 

కెనడాతో స్నేహం సవాల్ లాంటది అని వ్యాఖ్యానించారు విదేశాంగ మంత్రి. దేశం ఒక అత్యుత్తమ శక్తిగా మారుతున్న క్రమంలో ప్రపంచ దృష్టి ఆకర్షిస్తుంది. అలాంటి సమయంలో కొన్ని ప్రధాన శక్తులతో స్నేహం చేయడం కూడా ఒక సవాలే అని జైశంకర్ అన్నారు. గత ఏడాదిగా ఖలిస్తానీ విషంలో భారత్, కెనడాల మధ్య దౌత్యపరమైన వివాదాలు వస్తూనే ఉన్నాయి. వాటిని ఇండియా ప్రభుత్వం చాలా నెమ్మదిగా, నింపాదిగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తోందని చెప్పారు. 

Also Read: canada: కెనడా ఇక ఆపదా..సైబర్ ముప్పు దేశాల జాబితాలో భారత్ పేరు

Advertisment
Advertisment
తాజా కథనాలు