canada: కెనడా ఇక ఆపదా..సైబర్ ముప్పు దేశాల జాబితాలో భారత్ పేరు

రోజూ ఏదో ఒక విధంగా కెనడా భారత్‌ను కవ్విస్తూనే ఉంది. మొన్న అమితా షా మీద ఆరోపణలు చేసిన  కెనడా ప్రభుత్వం ఇప్పుడు భారత్‌ను సైబర్ ముప్పు దేశాల జాబితాలో చేర్చింది. 

New Update
Canada Prime Minister: ఎట్టకేలకు భారత్‌ ని వీడిన కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో!

Canada-India Row: 

భారత్‌‌–కెనడాల మధ్య దౌత్య సంబంధాలు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి.  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పై కెనడా మంత్రి అసంబద్ధ ఆరోపణలు చేసిన గంటల వ్యవధిలోనే ట్రూడో సర్కారు మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. భారత్‌ను సైబర్‌ ముప్పు దేశాల జాబితాలో చేర్చింది. చైనా, రష్యా, ఇరాన్‌, ఉత్తర కొరియా తర్వాత భారత్‌ నుంచి తమకు సైబర్‌ ముప్పు పొంచి ఉంచి ఉన్నట్లు వ్యాఖ్యానించింది. నిబంధనలకు విరుద్ధంగా భారత్‌ గూఢచర్యానికి పాల్పడుతోందని ఆరోపించింది. 

నేషనల్‌ సైబర్‌ థ్రెట్‌ అసెస్‌మెంట్‌ 2025-2026 పేరిట కెనడా ఓ నివేదికను సిద్ధం చేసింది. అందులో భారత్‌ పేరును చేర్చింది. భారత ప్రభుత్వం తమ దేశంలో సైబర్‌ దాడులకు పాల్పడేందుకు చూస్తోందని ఆరోపించింది.
తీవ్రవాద వ్యతిరేక కార్యకాలాపాల పేరుతో గూఢచర్యానికి పాల్పడుతోందని విమర్శించింది. దీని ప్రభావం ఇరుదేశాల మధ్య ధ్వైపాక్షి సంబంధాలపై పడుతుందని నిర్ధరించినట్లు కెనడా వ్యాఖ్యలు చేసింది. 

Also Read: Israel: గాజాపై ఇజ్రాయెల్ మళ్ళీ దాడి..దాదాపు వంద మంది మృతి

Advertisment
Advertisment
తాజా కథనాలు