Telangana:
భూదాన్ భూములంటూ ఆర్డీవో ఇచ్చిన ఉత్తర్వులను అప్పిలేట్ ట్రైబ్యునల్ అథారిటీ హోదాలో ధ్రువీకరించిన వ్యక్తే...రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు వారసత్వ ధ్రువీకరణ ప్రతం జారీ చేయడం పై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రంగారెడ్డి జిల్లా గత కలెక్టర్ ఇప్పటికే పలు కేసులు ఎదుర్కొంటున్నట్లు పత్రికల్లో కథనాలు చూశామని...నిజాం కూడా భూములను అలా కట్టబెట్టలేదని వ్యాఖ్యానించింది.
Also Read: Bangladesh: రాజ్యాంగంలో ‘సెక్యులర్’, ‘సోషలిస్ట్’ పదాలు తొలగించండి...!
ఆనాడు భూములను దివానీ, సర్ఫేకాజ్ , పట్టాలు అనే మూడు రకాలుగా గుర్తించిన నిజాంను అభినందించాలని పేర్కొంది. అధికారులపై ఆరోపణలు ఉన్నప్పుడు వారు కోర్టుకు సమాధానం చెప్పాల్సిందేనంటూ సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం సయ్యద్ యాకూబ్ కేసులో స్పష్టం చేసిందని హైకోర్టు తెలిపింది.
Also Read: AP Rains: అల్పపీడనం ప్రభావం.. ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!
భూదాన్ భూముల రక్షణకు అధికారులు చర్యలు తీసుకోకపోవడం పై అసంతృప్తి వ్యక్తం చేసింది. పేదల కోసం రామచంద్రా రెడ్డి 300 ఎకరాలను ఇవ్వగా..గతంలో ఉన్న భూదాన్ బోర్డుతో సహా అధికారులు అమ్ముకుని తినేశారని వ్యాఖ్యానించింది. తెలంగాణలో పేదలకు భూములను ఇచ్చిన ఎందరో గొప్పవాళ్లు ఉన్నారని, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు..అగ్రికల్చరల్ సీలింగ్ చట్టం అమల్లోకి వచ్చినప్పుడు 500 ఎకరాలు ఇచ్చేశారన్నారు.
Also Read: AP: విశాఖలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది..జమ్మూ నుంచి వచ్చి మరి యువతిని..!
భూదాన్ భూముల రక్షణలో గత బోర్డుతో సహా అధికారులు విఫలమయ్యారంది. ప్రస్తుత కేసులో 10 ఎకరాల భూమి భూదాన్ బోర్డుకు చెందినదని ధ్రువీకరించాక...వారసత్వ ధ్రువీకరణ పత్రం ఎలా జారీ చేస్తారో కౌంటర్ దాఖలు చేయాలంటూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి , భూదాన్ యజ్ఙబోర్డు , వ్యక్తిగత హోదాలో గత కలెక్టర్ డి. అమోయ్ కుమార్ , అప్పటి డీఆర్ వో ఆర్పీ జ్యోతితో పాటు మరో ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులకు నోటీసులు జారీ చేసింది.
Also Read: SA:గనిలో చిక్కుకున్న 4 వేల మంది చిన్నారులు..సాయం చేయనంటున్న ప్రభుత్వం!
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామం సర్వే నం. 182 లో10.92 ఎకరాలకు సంబంధించి ఖాదర్ ఉన్నీసా బేగంకు వారసత్వ ధ్రువీకరణ పత్రం జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ నవాబ్ ఫరూక్ అలీఖాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీని పై జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ గతంలో ఈ భూములను భూదాన్ భూములుగా ఆర్డీవో ఆదేశాలివ్వగా, స్పెషల్ ట్రైబ్యునల్ సమర్థించిందన్నారు.
అందుకు విరుద్దంగా ట్రైబ్యునల్ కు నేతృత్వం వహించిన అధికారి కలెక్టర్ హోదాలో ఖాదర్ హున్సీసా బేగం ఇచ్చిన దరఖాస్తును ఆమోదించి పట్టాదారు పాస్ బుక్ జారీ చేశారన్నారు. అంతే గాకుండా భూదాన్ భూములకు సంబంధించి యథాతథస్థితి కొనసాగించాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినా పట్టించుకోలేదన్నారు.
వాదనలను విన్న న్యాయమూర్తి...భూదాన్ భూములకు సంబంధించి వివాదం పెండింగ్ లో ఉన్నప్పటికీ ఆలోచించకుండా పట్టాపాస్ బుక్ జారీ చేశారన్నారు. ఈ భూముల పై యథాతథస్థితిని కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వివాదానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను 28 కి వాయిదా వేశారు.