TS: ఎన్నికలకు సిద్ధంకండి..డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈరోజు గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల మీద, కులగణన సర్వే మీదా ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు. 

New Update
పర్యాటక, సాంస్కృతిక అధికారులతో భట్టి మీటింగ్-LIVE

Deputy CM Bhatti Vikramarka: 

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని పార్టీలు రెడీ అవుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు కాంగ్రెస్ గంధీ భవన్‌లో సమావేశం నిర్వహించింది. ఇందులో ఎన్నికలకు సిద్ధం కావాలని కాంగ్రెస్ శ్రేణులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. గాంధీభవన్‌లో జరిగిన సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితర నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, కుల గణన సర్వేపై నేతలకు భట్టి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు, పార్టీ, ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఉండొద్దని సూచించారు.

 ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు కుట్రలు చేస్తూనే ఉన్నాయని...వాటిని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు భట్టి చెప్పారు. కొన్ని నియోజకవర్గాల్లో కొత్త పాత నేతల మధ్య విభేదాలు ఉన్నాయని.. వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. డిసెంబర్ 9 లోగా ప్రభుత్వ నామినేటేడ్ పోస్టులు భర్తీ చేస్తామని కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోన్న సందర్భంగా ప్రభుత్వం నిర్వహిస్తోన్న ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ వేడుకల్లో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని సూచించారు. 

Also Read: Cricket: హిట్ మ్యాన్, టీమ్ ఇండియా కెప్టెన్ వచ్చేస్తున్నాడు..

Advertisment
తాజా కథనాలు