TG Formation Day 2025: లాఠీలు విరిగినా లడాయి మానలే.. ఉద్యమం నాటి వీడియోలు వైరల్!

నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి.

New Update
Telangana movement videos

Telangana movement videos

TG Formation Day 2025:  నాలుగుకోట్ల ప్ర‌జ‌ల ఆకాంక్ష, అరవై ఏండ్ల ఆరాటం, అమరవీరుల త్యాగాలకు ప్రతిఫలం దక్కిన రోజు, తెలంగాణ సంకెళ్లు తెంపి స్వరాష్ట్రానికి రూపమందించిన రోజు.. నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం (TELANGANA FORMATION DAY 2025) సందర్భంగా  రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజకీయ నాయకులు, ప్రముఖులు  అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్ర ‌ప్ర‌జ‌లంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన కొన్ని వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి ఆనాటి అమరవీరులు త్యాగాలను మరోసారి గుర్తుచేస్తున్నాయి. లాఠీలు విరిగినా లడాయి మానలేదు. దెబ్బలు తిని జైలుకెళ్లినా వెనకడుగు వేయలేదు. ఉద్యమ నేతల స్పూర్తితో తెలంగాణ ముక్కోటి గొంతులకు ఒక్కటై స్వరాష్ట్రానికి నాంది పలికారు. 

Also Read :  కవిత్వమే ఆయుధంగా కాళోజి .. బతుకంతా తెలంగాణ కోసమే !

తెలంగాణ ఉద్యమ ఘట్టాలు

Also Read :  పైనాపిల్ తిన్న తర్వాత గొంతు దురద వస్తుందా? ఇది హెల్త్‌ను పాడు చేస్తుందా?

వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానం, అమరవీరుల త్యాగాలను ఈ వీడియో గుర్తుచేస్తుంది.  

Also Read :  కవిత్వమే ఆయుధంగా కాళోజి .. బతుకంతా తెలంగాణ కోసమే !

లాఠీ చార్జులు, విద్యార్థులు బలిదానాలు, తెలంగాణనే  జీవితంగా పోరాడిన ఉద్యమకారుల త్యాగఫలమే ఈ తెలంగాణ  

చాకలి ఐలమ్మ, గద్దర్ వంటి ఉద్యమ కారుల స్పూర్తితో వందల మంది విద్యార్థులు ఉద్యమమే ఊపిరిగా పోరాడారు. 

Also Read :  నేటి నుంచే రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్‌.. తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే!

తెలంగాణ ఉద్యమ సమయంలో ఓయూ జేఏసీ విద్యార్థులు సంఘం ఇందిరా పార్కు వరకు ర్యాలీగా వెళ్లి.. అక్కడి నుంచి అసెంబ్లీని ముట్టడిస్తామని ప్రకటించారు.  ఈ సమయంలో కొంతమంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఓ నెటిజన్లు తాను ఉద్యమంలో పాల్గొన్న రోజులను.. లాఠీ దెబ్బలు తిని, జైలుకెళ్లినా రోజులను గుర్తుచేసుకుంటూ ఈ ఫొటోను పంచుకున్నారు. 

తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీలో టెన్షన్ నెలకొన్న విజువల్స్. ఆ సమయంలో పోలీసులు విద్యార్థులను కంట్రోల్ చేసేందుకు 25- 30 రౌండ్ల టియర్ గ్యాస్ వదిలారు. 

Also Read: మమతా పాలనలో దారుణాలు.. బెంగాల్‌లో అధికారం మాదే: అమిత్ షా

 

telangana-movement

Advertisment
Advertisment
తాజా కథనాలు