TG:టీచర్ ఉద్యోగాల భర్తీలో గందరగోళం.. మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్.. ! టీచర్ పోస్టుల భర్తీలో పొరపాట్లు జరిగినట్లు గుర్తించిన తెలంగాణ విద్యా శాఖ డీఎస్సీ స్పోర్ట్స్ కోటా కింద ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాలను పునఃపరిశీలించాలని నిర్ణయించింది. By Bhavana 14 Nov 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి Telangana: టీచర్ పోస్టుల భర్తీలో పొరపాట్లు జరిగినట్లు తెలుసుకున్న తెలంగాణ విద్యాశాఖ డీఎస్సీ స్పోర్ట్స్ కోటా కింద ఎంపికైన అభ్యర్థుల ధ్రువ పత్రాలను మరోసారి పరిశీలించాలని నిర్ణయించుకుంది. ఈ నెల 20 నుంచి ఈ ప్రక్రియను నిర్వహించాలంటూ తాజాగా సర్క్యూలర్ ను ఇష్యూ చేసింది. ఈ మేరకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులతో పాటు ఇదే కోటాలో ఎంపికవ్వని అభ్యర్థులకు కూడా మరోసారి పత్రాలను పరిశీలించనున్నారు. Also Read: Hydrogen Train: త్వరలో ఈ మార్గంలో నీటితో నడిచే హైడ్రోజన్ ట్రైన్! ఈ విషయం గురించి ఇప్పటికే ఫోన్ల ద్వారా అభ్యర్థులకు సమాచారాన్ని అందించారు. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 10,006 పోస్టులను అధికారులు భర్తీ చేశారు. గత నెల 9న ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఈ నియామక పత్రాలను అందించారు. డీఎస్సీ పరీక్ష నిర్వహించి, ఈ ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారు. Also Read: Nara Lokesh: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..16 వేల ఉద్యోగాల భర్తీ! అయితే, ఈ ఎంపికలో కొన్ని పొరపాట్లు దొర్లినట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా రీ వెరిఫికేషన్ సమయంలోనే ఈ తప్పులు దొర్లాయని, దీంతో అర్హులు కానీ వారు కొందరు ఉద్యోగాలకు ఎంపికైనట్లు అధికారులు తెలుసుకున్నారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఆ జిల్లాలో పండిట్స్ పోస్టులకు ఎంపికైన వారిలో ఏడుగురిని అనర్హులుగా గుర్తించారు. వీరిని ఉద్యోగాల నుంచి తొలగించారు. ఇందుకు బాధ్యులుగా ప్రధానోపాధ్యాయులను సస్పెండ్ చేశారు. అయితే, తాజాగా స్పోర్ట్స్ కోటాలో టీచర్ పోస్టులకు ఎంపికైన వారిలో కూడా కొందరు బోగస్ అభ్యర్థులున్నట్టు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. Also Read: Karnataka: 50 మంది ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల చొప్పున..బీజేపీ బంపరాఫర్! సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో ఇప్పటికే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన సంబంధించి తాజాగా నిర్వహించే ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో అనర్హులుగా గుర్తిస్తే మాత్రం వారిని ఉద్యోగాలను తొలగించే అవకాశాలున్నాయి. అలాగే... ఇప్పటి వరకు ఉద్యోగాలకు ఎంపిక కానీ వారు.... ఈ సారి నిర్వహించే సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో అర్హులుగా గుర్తిస్తే వారికి ఉద్యోగాలను ఇచ్చే విషయాన్ని పరిశీలించే అవకాశాలున్నాయి. అయితే ఈ విషయంలో సాంకేతిక సమస్య తలెత్తే అవకాశాలున్నాయి. ఇప్పటికే స్పోర్ట్స్ కోటాలోని పోస్టుల మొత్తాన్ని భర్తీ చేశారు. కొత్తగా అర్హులను గుర్తిస్తే... వారికి ఉద్యోగం ఇవ్వడానికి ఖాళీ పోస్టులు అయితే లేవు. Also Read: Ap Rains: బలహీన పడిన అల్పపీడనం..నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు! #teacher job #woman dismissed teacher job #telangana teacher jobs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి