Karnataka: 50 మంది ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల చొప్పున..బీజేపీ బంపరాఫర్‌!

సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ చేయని ప్రయత్నం లేదని, తమ ఎమ్మెల్యేలను కొనేందుకు భారీ మొత్తం ఆశ పెట్టిందని ఆయన ఆరోపణలు చేయడం గమనార్హం.

New Update
Siddaramaiah 2

Karnataka:

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య బీజేపీ పై సంచలన ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి బీజేపీ కుట్రలు పన్నుతుందని , కాంగ్రెస్‌ కు చెందిన 50 మంది ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ. 50 కోట్లు ఇవ్వాలని ఆశ చూపించిందని ఆయన ఆరోపణలు చేశారు. అయితే, ఇందుకు ఏ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కూడా అంగీకరించకపోవడంతో తమపై తప్పుడు కేసులు పెట్టే పనిలో బీజేపీ ఉందని విమర్శించారు.

Also Read: T20 : సెంచరతో అదరగొట్టిన తెలుగోడు తిలక్ వర్మ

తన సొంత నియోజకవర్గం మైసూరులో బుధవారం పర్యటించిన సీఎం సిద్ధరామయ్య.. పలు అభివృద్ధి కార్యక్రమాలను మొదలుపెట్టారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన సభలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష బీజేపీపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ నాయకులంతా కోట్లకు కోట్లు పోగేసుకున్నారని, ఆ డబ్బును తమ ఎమ్మెల్యేలకు ఇచ్చేందుకు ఎరగా వేశారని సిద్దరామయ్య  విమర్శించారు. అయినప్పటికీ మా ఎమ్మెల్యేలు ఎవరూ ప్రలోభానికి గురికాకపోవడంతో తప్పుడు కేసులు పెట్టి ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు సాగిస్తున్నారని మండిపడ్డారు.

Also Read:  Hydrogen Train: త్వరలో ఈ మార్గంలో నీటితో నడిచే హైడ్రోజన్ ట్రైన్‌!

‘‘సిద్ధరామయ్య సర్కారును ఎలాగైనా కూల్చివేయాలని కంకణం కట్టుకున్నారు.... 50 మంది ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల చొప్పున వారు ఇవ్వాలని చూశారు. అంత సొమ్ము వారికి ఎక్కడ నుంచి వచ్చింది? నోట్లను ఏమైనా ముద్రిస్తున్నారా? మాజీ ముఖ్యమంత్రులు బీఎస్‌ యడియూరప్ప, బసవరాజ్‌ బొమ్మై, విపక్ష నేత ఆర్‌ ఆశోకా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర ఆ డబ్బును ఇస్తున్నారా?’ అని సీఎం ప్రశ్నల వర్షం కురిపించారు.

Also Read: Nara Lokesh: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌..16 వేల ఉద్యోగాల భర్తీ!

మరోవైపు, బీజేపీ నేతలు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని సిద్ధూ దుయ్యబట్టారు. బందీపుర అభయారణ్యం పరిధిలోని రహదారులపై రాత్రుళ్లు వాహన సంచారాన్ని నిలిపివేసే అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి చర్చ జరగలేదని సీఎం అన్నారు. ఈ విషయంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్న మాటలు తన దృష్టికి రాలేదని అన్నారు. కాగా, చెన్నపట్న ఉప-ఎన్నికల ప్రచారం చివరి రోజున తన మనవడు, ఎన్డీఏ అభ్యర్ధి నిఖిల్ కుమారస్వామి తరఫున ప్రచారం నిర్వహించిన జేడీ(ఎస్) అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ.. సిద్ధరామయ్య ప్రభుత్వం జనవరి తర్వాత ఉండదని వ్యాఖ్యానించారు. 

Also Read:  Ap Rains: బలహీన పడిన అల్పపీడనం..నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

ఈ క్రమంలో ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని కర్ణాటక సీఎం ఆరోపణలు చేయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా ప్రాధాన్యత సంతరించుకుంది. దేవెగౌడ మాట్లాడుతూ.. ‘ఎన్డీఏ అభ్యర్ధి నిఖిల్ కుమారస్వామిని గెలిపించి.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అహంకారాన్ని అణచివేయాలి.. జనవరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని కేంద్ర మంత్రి సోమన్న అన్నారు.. ఇది జోస్యం కాదు.. జరగబోయేది ఇదే’ అంటూ దేవెగౌడ చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు