Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ 9 ఆదివారం ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. ఈ ప్రోమోలో 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రష్మిక, రక్షిత్ శెట్టి స్టేజ్ పై సందడి చేశారు. కంటెస్టెంట్స్ స్కిట్స్, ఆటపాటలతో నవ్వులు పూయించారు. ఈ ప్రోమోలో హోస్ట్ నాగార్జున నేషనల్ క్రష్ రశ్మికను మెప్పించేందుకు కంటెస్టెంట్లకు ఒక ఫన్ టాస్క్ ఇచ్చారు. ఒక సినిమాలోని ఫేమస్ సీన్ ని చూపించి.. దానిని రిక్రియెట్ చేయాలని తెలిపారు. ఇందులో భాగంగా రీతూ, డెమోన్ పవన్ ప్రతిరోజు పండగ సినిమాలోని డైనింగ్ టేబుల్ సీన్ రిక్రియెట్ చేయగా.. తనూజ- పవన్ కళ్యాణ్ పోకిరి లిఫ్ట్ సీన్ రీక్రియెట్ చేశారు. ఆ తర్వాత సంజన, భరణి, మాధురి, రీతూ, దివ్వెల మాధురి అదుర్స్ మూవీలోని బ్రహ్మానందం లవ్ ప్రపోజల్ సీన్ రిక్రియెట్ చేశారు. భరణి భట్టుగా, డెమోన్ చారిగా, రీతూ చంద్రకళగా, మాధురి చారి బామ్మగా, సంజన రామప్రభగా నటించి నవ్వులు పూయించారు. భరణి- దివ్వెల మాధురి డైలాగులు, పర్ఫామెన్స్ అదిరిపోయాయి.
Also Read: Bigg Boss 9: బిగ్ బాస్ ఎలిమినేషన్ బిగ్ ట్విస్ట్.. దువ్వాడ మాధురి అవుట్! కారణం ఇదేనా?
Follow Us