BIG BREAKING: అజారుద్దీన్‌కు కీలక శాఖలు కేటాయించిన ప్రభుత్వం

ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్‌కు రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన శాఖల కేటాయించింది. ప్రస్తుతం సీఎం రేవంత్‌ దగ్గర ఉన్న ప్రభుత్వ రంగం సంస్థలతో పాటు మైనార్టీ వెల్ఫేర్‌ శాఖను కేటాయించారు.

New Update
Azaruddin

Azaruddin

ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్‌కు రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన శాఖల కేటాయించింది. ప్రస్తుతం సీఎం రేవంత్‌ దగ్గర ఉన్న ప్రభుత్వ రంగం సంస్థలతో పాటు మైనార్టీ వెల్ఫేర్‌ శాఖను కేటాయించారు. ఇంతకుముందు మైనార్టీ శాఖ అడ్లూరి లక్ష్మణ్ వద్ద ఉన్న సంగతి తెలిసిందే. ఈ శాఖను తాజాగా అజారుద్దీన్‌కు కేటాయించారు. 

Also Read: అయ్యో బిడ్డలు.. తల్లడిల్లిన తాండూరు.. ఎటు చూసినా ఏడుపే.. కన్నీటి యాత్ర!-VIDEO

ఇదిలాఉండగా మంత్రివర్గంలో మైనార్టీ వర్గాలకు స్థానం లేదని విపక్ష పార్టీల నుంచి విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. రెండు నెలల క్రితమే గవర్నర్‌ కోటాలో అజారుద్దీన్‌కు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బాధ్యతలు అప్పగించింది. తాజాగా ప్రభుత్వ రంగ సంస్థలు, మైనార్టీ శాఖలను కేటాయించింది. మరికొన్ని రోజుల్లో జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు హైదరాబాద్‌కు చెందిన కాంగ్రెస్‌ నేతలలో ఒక్కరికి మంత్రి లేదు. తాజాగా అజారుద్దీన్‌కు మంత్రి పదవి అందించడం ప్రాధాన్యం సంతరించుకుంది.  

Advertisment
తాజా కథనాలు