వాహనదారులకు హెచ్చరిక.. టీఎస్‌ను అలా మారిస్తే లైసెన్స్ రద్దు..!

వాహనదారులను తెలంగాణ రవాణా శాఖ హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నాటి నుంచి కొన్న కొత్త వాహనాలకు మాత్రమే టీజీ సిరీస్ వర్తిస్తుందని తెలిపింది. పాత వాహనాల నెంబర్ ప్లేట్లను టీఎస్‌కి బదులు టీజీగా మారిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపింది.

New Update
TS To TG Number Plates

తెలంగాణలో వాహనదారులకు రాష్ట్ర రవాణా శాఖ సూచనలు చేసింది. కొత్త వాహనాలకు మాత్రమే టీజీ సిరీస్ వర్తిస్తుందని తెలిపింది. ఈ మేరకు పాత వాహనాలను హెచ్చరించింది. ఇకపై అలా చేస్తే లైసెన్స్ రద్దు చేస్తామని రవాణా శాఖ అధికారులు తెలిపారు. అయితే మరి పాత వాహనదారులకు రాష్ట్ర రవాణా శాఖ అధికారులు ఏ విషయంపై హెచ్చరిక చేశారో అనే విషయానికొస్తే..

ఇది కూడా చదవండి: అలా అన్నందుకే ఇంటర్ విద్యార్థినిని చంపేశాడు: ఎస్పీ హర్షవర్ధన్‌రాజు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త కొత్త మార్పులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్‌ను టీజీగా మారుస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌లో తెలంగాణకు టీజీగానే ఆమోదం తెలిపింది. 

ఇది కూడా చదవండి: ఎమ్మెల్సీ భరత్‌ మిస్సింగ్.. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వండి!

కేసీఆర్ హయాంలో టీఎస్

అయితే ఇది ఇప్పటి అభిప్రాయం కాదు. దాదాపు 2014లోనే టీజీగా పెట్టాలని అనుకున్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ సమయంలో వెహికల్ రిజిస్ట్రేషన్‌తో పాటు ఇతర సంస్థలకు టీఎస్ (తెలంగాణ స్టేట్) అని పెట్టాలని అప్పటి కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సమయంలోనే టీఎస్‌‌కి బదులు టీజీ పెట్టాలని కొందరి నుంచి అభిప్రాయం వ్యక్తం అయింది. కానీ అది నోచుకోలేదు.

ఇది కూడా చదవండి: నేటి నుంచి గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్..!

రేవంత్ రెడ్డి హయాంలో టీజీ

ఇక ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దానిని టీజీగా మార్చింది. అప్పటి నుంచి కొందరు వాహన దారులు నెంబర్ ప్లేట్లను ట్యాంపరింగ్ చేయడం మొదలెట్టారు. తమ నెంబర్ ప్లేట్‌లలోని టీఎస్ అక్షరాలను టీజీగా మారుస్తున్నారు. దీనిని గమనించిన రవాణా శాఖ అధికారులు పాత వాహనాల నెంబర్ ప్లేట్‌లలో మార్పులు చేస్తున్న వారిని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: ఎక్కువమందిని కంటేనే ఎన్నికల్లో ఛాన్స్.. చంద్రబాబు సంచలన ప్రకటన!

అలా చేస్తే లైసెన్స్ రద్దు

రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నాటి నుంచి కొనుగోలు చేసిన వెహికల్స్‌కు మాత్రమే టీజీ సిరీస్ వర్తిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఎవరైనా తమ పాత వాహనాల నెంబర్ ప్లేట్లపై రాష్ట్ర కోడ్‌ను టీజీగా మారిస్తే దానిని ట్యాంపరింగ్‌గా భావించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గట్టి వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు.. అలాంటి వాహనదారుల లైసెన్స్ రద్దు చేసేందుకు కూడా వెనకాడబోమని అన్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు