ఎక్కువమందిని కంటేనే ఎన్నికల్లో ఛాన్స్.. చంద్రబాబు సంచలన ప్రకటన!

సౌత్‌ ఇండియాలో జనాభా తగ్గుదలపై ఏపీ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. దంపతులు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనాలంటూ పిలుపునిచ్చారు. ఏపీలో ఎక్కువ మంది పిల్లలున్నవారికే ఎన్నికల్లో ప్రోత్సాహం అందించాలని తమ ప్రభుత్వం యోచిస్తున్నట్లు చెప్పారు. 

author-image
By srinivas
New Update
dse weZ

AP News: సౌత్‌ ఇండియాలో జనాభా తగ్గుదలపై ఏపీ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. దంపతులు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనాలంటూ పిలపునిచ్చారు. అంతేకాదు ఏపీలో ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికే ప్రోత్సాహాలు అందించాలని తమ ప్రభుత్వం  యోచిస్తోందని చెప్పారు. 

ఎక్కువ మంది పిల్లలున్న వారికి అవకాశం..

ఈ మేరకు ఆదివారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికల్లో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారికి అవకాశం కల్పిస్తామన్నారు. ఇది వరకు ఉన్న చట్టాన్ని ఉపసంహరించుకుంటామన్న చంద్రబాబు.. పిల్లల విషయంలో కొత్త చట్టాన్ని త్వరలోనే రూపొందించనున్నట్లు వెల్లడించారు. ఏపీతోపాటు పలు రాష్ట్రాల్లోనూ గ్రామాల్లో వయోవృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు. 

ఇది కూడా చదవండి: యాదాద్రి ఆలయంలో కౌశిక్‌రెడ్డి ఫొటోషూట్.. మండిపడుతున్న భక్తులు

గుర్ల ఘటనపై అధికారులకు సూచనలు..

ఇందులో భాగంగానే విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గుర్లలో అతిసారంతో 8 మంది మృతి చెందిన ఘటనపై  సమీక్ష నిర్వహించారు. గ్రామ పరిస్థితి, బాధితులకు అందుతున్న వైద్య సాయంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ‘డయేరియా కారణంగానే మరణాలు’ అనే అంశంపై వైద్యశాఖ అధికారులతో మాట్లాడిన చంద్రబాబుకు.. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, సురక్షిత తాగునీరు అందిస్తున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. ఇక సీనియర్ ఐఏఎస్ అధికారి కె.విజయానంద్‌తో ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 

ఇది కూడా చదవండి: ISIS : శిశువుల మాంసం వండిపెట్టిన ఐసీస్‌.. ఆ మతస్థులే లక్ష్యంగా దాడులు!

Advertisment
తాజా కథనాలు