రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. మార్పులు, చేర్పులకు గ్రీన్ సిగ్నల్

రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేసుకోవడానికి రేవంత్ రెడ్డి సర్కార్ అవకాశం కల్పిస్తోంది. కొత్తగా కుటుంబంలోకి పేర్లు చేర్చుకోవడానికి, ఉన్న పేర్లు తొలగించడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించనుంది.

Revanth 5
New Update

తెలంగాణ రేషన్ కార్డుదారులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేయడానికి అవకాశం కల్పిస్తోంది. అలాగే కుటుంబంలోకి కొత్తగా పేర్లు చేర్చుకోవడానికి, ఉన్న పేర్లు తొలగించడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. గత కొన్నేళ్ల నుంచి తెలంగాణలో రేషన్ కార్డులు మంజూరు చేయలేదు.

ఇది కూడా చూడండి: చైనాలో దారుణం.. కత్తి దాడిలో 8 మంది మృతి

గత పదేళ్ల నుంచి..

దీనివల్ల చాలా కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి. కొత్త రేషన్ కార్డులకు మంజూరు చేసి దాదాపుగా పదేళ్లు అయ్యాయి. ఈ పదేళ్లలో కొత్త కుటుంబాలు ఏర్పడం, భార్య, పిల్లలు ఇలా ఏర్పడ్డారు. కానీ రేషన్ కార్డుల్లో మార్పులు చేయడానికి మాత్రం అవకాశం రాలేదు. దీనివల్ల చాలా మంది సంక్షేమ పథకాలకు అర్హులు కాలేకపోవడం చాలా ఇబ్బందులు పడ్డారు. 

ఇది కూడా చూడండి:  ‘నెట్ స్పీడ్ పెరిగిందో మీ పని ఖతం.. బాడీలో ఆ పార్ట్‌కు ముప్పు’

రేషన్ కార్డులో మార్పులు, చేర్పులు చేయాలనుకునే వారు మీసేవ సెంటర్‌కు వెళ్లాలి. ఇందులో పిల్లల పేర్లు యాడ్ చేయాలంటే వారి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చూపించాలి. లేదా ఆధార్ కార్డు అయిన తీసుకెళ్లాలి. వివాహమైన వారైతే భార్య పేరును రేషన్ కార్డులో యాడ్ చేయాలంటే మ్యారేజ్ సర్టిఫికెట్ ద్వారా మార్పులు చేసుకోవచ్చు.

ఇది కూడా చూడండి: ప్రెగ్నెంట్ చేస్తే లక్షల్లో డబ్బు అంటూ.. నిరుద్యోగ అబ్బాయిలే టార్గెట్

రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసుకోవడానికి మీసేవ సెంటర్ లో సాధారణ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అధికారిక వెబ్‌సైట్ ద్వారా మీరు రేషన్ కార్డు ఆప్షన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. దీంతోపాటు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణకు త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: TG Group-3: నేడే గ్రూప్-3 పరీక్ష.. అభ్యర్థులకు నిపుణుల కీలక సూచన!

#ration-card
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe