రెండు తెలుగు రాష్ట్రాల్లోని రహదారులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాయి. ఇందులో భాగంగానే వాహనదారులకు ఎలాంటి ఆటంకం లేకుండా కొత్తగా రోడ్ల నిర్మాణాలు, అలాగే రోడ్డు విస్తరణ పనుల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా తెలంగాణలో మరో రహదారి విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Also Read: మారథాన్‌లో సీఎం.. 2 గంటల్లో 21 కిలోమీటర్లు
హుస్నాబాద్ నుంచి కరీంనగర్ మధ్య రహదారిలో కొత్తపల్లి (రాజీవ్ రహదారి) ప్రస్తుతం రెండు లైన్‌లలో మాత్రం ఉంది. అయితే ఇప్పుడు ఆ రెండు లైన్‌ల రోడ్డును విస్తరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ రోడ్డును ఇప్పుడు నాలుగు లైన్‌లుగా విస్తరించేందుకు రేవంత్ సర్కార్ ముందుకొచ్చింది.
Also Read: నేటి నుంచి గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్..!
రూ.77.20 కోట్లు మంజూరు
మొదటి దశలో రహదారి అభివృద్ధికి దాదాపు రూ.77.20 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు తాజాగా రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ జీవో జారీ చేశారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడారు. కొత్తపల్లి - హుస్నాబాద్ - జనగాం నేషనల్ హైవేను డెవలప్ చేయాలనే డిమాండ్ గత మూడేళ్లుగా ఉందని అన్నారు.
Also Read: పొంచి ఉన్న తుపాన్ ముప్పు..తెలంగాణలో వానలే వానలు!
ఈ జిల్లాల మీదుగా
కరీంనగర్ -హుస్నాబాద్ - జనగాం మీదుగా యాదగిరిగుట్ట, సూర్యాపేట, విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉందని అన్నారు. అదే సమయంలో కరీంనగర్ వైపు మంచిర్యాల, గోదావరిఖని, జగిత్యాల ప్రాంతాలకు వాహనాల రాకపోకలు సాగనున్నాయి. కాగా ఈ రహదారిని నాలుగు లైన్‌లుగా విస్తరించేందుకు రాష్ట్రం ప్రభుత్వం అనేక సార్లు కేంద్ర వద్ద ప్రతిపాదనలు పెట్టింది.
Also Read: బంధువులు మరణిస్తే దీపావళి జరుపుకోవచ్చా?
అయినా ఎప్పటికీ కేంద్రం స్పందించకపోవడంతో రేవంత్ సర్కార్ ముందుకొచ్చింది. ఇక ఇప్పుడు రెండు లైన్‌లుగా ఉన్న రహదారులు నాలుగు లైన్‌లుగా మారితే ఆయా జిల్లాల ప్రజల రవాణా సౌకర్యాలు మరింత మెరుగు అవుతాయి.