Telangana: పొంచి ఉన్న తుపాన్ ముప్పు..తెలంగాణలో వానలే వానలు! తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.రాగల 24 గంటల్లో ఉత్తర అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు అధికారులు వివరించారు. By Bhavana 21 Oct 2024 in తెలంగాణ వరంగల్ New Update షేర్ చేయండి Telangana: తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో వర్ష సూచన ఉన్న జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. అండమాన్ మీదుగా ఉపరితల ఆవర్తనం ఉందని.. దాని ప్రభావంతో రాగల 24 గంటల్లో తూర్పు మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న ఉత్తర అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు వివరించారు. Also Read: నేటి నుంచి గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్..! ఈ నెల 22 నాటికి పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ బలపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ కేంద్రం వివరించింది. 23వ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై తుఫానుగా మారుతుందని అధికారులు తెలిపారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఉత్తర తమిళనాడు తీరప్రాంతంలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉందని..ఇది ఎత్తుకు వెళ్లే కొద్ది నైరుతి దిశగా ఉంటుందని అధికారులు తెలిపారు. Also Read: అలా అన్నందుకే ఇంటర్ విద్యార్థినిని చంపేశాడు: ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ఈ క్రమంలో రాష్ట్రంలో ఆదివారం వరంగల్, హన్మకొండ, వనపర్తి, నారాయణపేట, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహూబాబాద్,జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలుపడే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో వర్ష సూచన ఉన్న జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. అలాగే, ఈ నెల 25 వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. Also Read: ఎమ్మెల్సీ భరత్ మిస్సింగ్.. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వండి! ఏపీకి పొంచి ఉన్న ముప్పు! ఏపీకి మరోసారి తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఉత్తర అండమాన్ మీదుగా ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తర అండమాన్‌లో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా వెళ్లి మంగళవారానికి వాయుగుండంగా మారే సూచనలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ వాయుగుండం కాస్త ఈనెల 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశాలు కనపడుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. Also Read: బండారు దత్తాత్రేయ కాన్వాయ్ కి ప్రమాదం..! ఈ తుపాను ఈనెల 24 నాటికి ఒడిశా-బెంగాల్ తీరాలకు చేరే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ వివరించింది. దీని ప్రభావంతో ఈనెల 24,25 తేదీల్లో ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. ఈనెల23,24 తేదీల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు చెప్పారు. ఆ సమయంలో జాలర్లు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసింది. వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే సముద్రం నుంచి తిరిగి వచ్చేయాలని హెచ్చరికలు జారీ చేశారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి