టెన్త్ విద్యార్థులకు అలెర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణ ప్రభుత్వం టెన్త్ పరీక్షలు 2025 షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు జరగనున్నాయి.

New Update
TS SSC Exams: ఆ ఎగ్జామ్ రెండు రోజులు రాయాలా?.. పదో తరగతి పరీక్షలో మార్పు!

SSC Exam: తెలంగాణ ప్రభుత్వం  పదవ తరగతికి సంబంధించిన పరీక్షల షెడ్యూల్ ని విడుదల చేసింది. 2025 మార్చి 21 నుంచి ఏప్రిల్ వరకు పరీక్షలు నిర్వహించున్నట్లు విద్యాశాఖ తెలిపింది. టెన్త్ పరీక్షలు ఉదయం  9.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12.30  నిమిషాల  వరకు పరీక్ష జరగనున్నట్లు తెలిపారు. 

ప‌ది ప‌రీక్ష‌ల టైం టేబుల్ ఇదే..

  • మార్చి 21(శుక్ర‌వారం) – ఫ‌స్ట్ లాంగ్వేజ్
  • మార్చి 22(శ‌నివారం) – సెకండ్ లాంగ్వేజ్
  • మార్చి 24(సోమ‌వారం) – థ‌ర్డ్ లాంగ్వేజ్(ఇంగ్లీష్‌)
  • మార్చి 26(బుధ‌వారం) – గ‌ణితం
  • మార్చి 28(శుక్ర‌వారం) – సైన్స్‌(ఫిజిక‌ల్ సైన్స్‌)
  • మార్చి 29(శ‌నివారం) – సైన్స్‌(బ‌యోలాజిక‌ల్ సైన్స్‌)
  • ఏప్రిల్ 2(బుధ‌వారం) – సోష‌ల్ స్ట‌డీస్
  • ఏప్రిల్ 3(గురువారం) – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్ -1
  • ఏప్రిల్ 4(శుక్ర‌వారం) – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్ -2

Also Read: ఎయిర్‌పోర్టులో జర్నలిస్టులతో విరాట్ కోహ్లీ వాగ్వాదం.. వీడియో వైరల్

ఇప్పటికే  పదో తరగతి పరీక్షల్లో పలు మార్పులు చేస్తున్నట్లు కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఇప్పటి వరకు 80 మార్కులకు ఉన్న పరీక్ష పేపర్‌ను ఇకపై 100 మార్కులకు ప్రిపేర్ చేయనున్నట్లు తెలిపింది. వచ్చే విద్యా సంవత్సరం 2024-2025 నుంచి 100 మార్కులకే పరీక్ష పేపర్ ఉంటుందని విద్యాశాఖ పేర్కొంది.  అయితే గతేడాది వరకు 80 మార్కులకు పేపర్ ఉండగా.. 20  ఇంటర్నల్  మార్కులు ఉండేవి.

ఈ పద్ధతిని ఇకపై ఆపేయాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ గ్రేడింగ్ సిస్టమ్‌ను కూడా తీసేస్తున్నట్లు వెల్లడించింది.  ఇంటర్నల్ పరీక్షల్లో అక్రమాలు జరుగుతున్నాయని విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు ఫైనల్ పరీక్షల్లో కూడా విద్యార్థులకు 24 పేజీల ఆన్సర్‌ బుక్‌లెట్స్‌ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.

ఇది కూడా చూడండి:ఫైనల్లీ.. క్లీంకార ఫొటో షేర్ చేసిన ఉపాసన.. తాత చేతుల్లో ఎంత ముద్దుగా ఉందో..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు