టాలీవుడ్ లో ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా భారీ క్రేజ్ తెచ్చుకున్న జగపతి బాబు.. కొన్నాళ్ల క్రితం విలన్ గా రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. 'లెజెండ్' మూవీతో బోయపాటి ఆయన్ని విలన్ గా రీ ఇంట్రడ్యూస్ చేశారు. దాంతో ఆయన కెరీర్ పూర్తిగా మారిపోయింది. హీరోగా కంటే విలన్ గా ఆయన క్రేజ్ డబుల్ అయింది. ఇప్పుడు స్టార్ విలన్ గా కొనసాగుతూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. విలన్ గా, సపోర్టివ్ రోల్స్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈయన.. ఈ మధ్యకాలంలో సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఆయనకు సంబంధించిన అప్‌డేట్‌లను నెటిజన్లతో షేర్ చేస్తూ.. పలు పోస్టులతో ఫాలోవర్స్‌ను పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే జగ్గూభాయ్ ఎక్స్ వేదికగా షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. Also Read: కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కి.. సూసైడ్ చేసుకున్న సింగర్ శృతి కన్నీటి కథ! Evito ee thindigolla!!!! Ila aythey Ela ayipotthaano. pic.twitter.com/97l5A0xscW — Jaggu Bhai (@IamJagguBhai) December 18, 2024 ఆ వీడియోలో జగపతి బాబు.. తన కోసం యూట్యూబేర్ రవి అనే వ్యక్తి ఫుడ్ పంపించాడని చెబుతూ ఫుడ్ ఐటమ్స్ ను పరిచయం చేశాడు. ఫ్రాన్స్ బిర్యానీ, మటన్ ఫ్రై, నాటుకోడి కర్రీ, ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు, రసం, రైతా, బొమ్మిడాయిల పులుసు, పీతల కూర.. ఇవన్నీయూట్యూబర్ రవి నాకోసం పంపించాడు. రోజూ ఇలాగే వస్తున్నాయి.. కానీ రోజూ ఇలా పెడితే నన్నేమనుకుంటారో అని చూపించడంలేదు.. మీరు ఇవన్నీ చూసి నోరు ఊరేలోపు నేను ఇవన్నీ తిని పడుకుంటా..' అంటూ వీడియోలో పేర్కొన్నాడు. దీన్ని చూసిన నెటిజన్స్ జగ్గూభాయ్ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు, ఒక్క రోజుకే అన్ని ఐటమ్సా?, జగపతి బాబు ఫుడ్ లవర్ అనుకుంటా బ్రో వెజ్, నాన్ వెజ్ అని తేడా లేకుండా లాగించేస్తున్నాడు..' అంటూ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. Also Read : 'ఇండియన్ 2' కి నెగిటివ్ రివ్యూలు.. ఎట్టకేలకు నోరు విప్పిన శంకర్, ఏమన్నారంటే