గోదావరి-కావేరి నీటిలో సగం వాటా ఇవ్వాల్సిందే: తెలంగాణ

గోదావరి-కావేరి నదుల అనుసంధానానికి సంబంధించి తెలంగాణ కీలక విజ్ఞప్తి చేసింది. ఈ నదుల నుంచి తరలించే నీటిలో 148 టీఎంసీల్లో సగం వాటా ఇవ్వాల్సిందేనని మరోసారి జాతీయ జల అభివృద్ధి సంస్థ (NWDA)ను కోరింది.

New Update
RIVER

గోదావరి-కావేరి నదుల అనుసంధానానికి సంబంధించి తెలంగాణ కీలక విజ్ఞప్తి చేసింది. ఈ నదుల నుంచి తరలించే నీటిలో 148 టీఎంసీల్లో సగం వాటా ఇవ్వాల్సిందేనని మరోసారి జాతీయ జల అభివృద్ధి సంస్థ (NWDA)ను కోరింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం ఎన్‌డబ్ల్యూడీఏ 74వ పాలక మండలి సమావేశం కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ అధ్యక్షతన జరిగింది. తెలంగాణ నుంచి నీటి పారుదలశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్, ఇంజినీర్లు హైదరాబాద్‌ నుంచి వర్చువల్ విధానంలో ఈ భేటీలో పాల్గొన్నారు. 

Also read: తల్లికి బంగారం కొనిచ్చేందుకు.. ఏకంగా ఏటీఎంనే కొల్లగొట్టిన కొడుకు?

తెలంగాణ నుంచే ఈ ప్రాజెక్టును చేపట్టడం వల్ల అధిక భూభాగాన్ని కోల్పోతున్నామని.. ఇందుకోసం తమకు ఎక్కువ వాటా రావాల్సిందేనని జాతీయ జల మండలి సంస్థను కోరారు. 83 మీటర్ల ఎగువ నుంచే నీటిని తీసుకోవాలని తెలిపారు. అలాగే సమ్మక్కసాగర్, దేవాదుల, సీతారామ ప్రాజెక్టులకు 152 టీఎంసీల నీటి కేటాయింపులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉండరాదని చెప్పారు. 

అయితే మళ్లించే నీటిలో 42 టీఎంసీలకు మించి తెలంగాణనకు నీటిని ఇవ్వలేమని కేంద్ర జలశక్తి శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రాలు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ నెలాఖరులో మరోసారి సమావేశం నిర్వహిస్తామని చెప్పింది. ఈ సమావేశంలో తామే నిర్ణయం తీసుకొని ముందుకెళ్లే యోచనలో ఉంది. ఇదిలాఉండగా ఈ ఏడాది ఆగస్టులోనే తెలంగాణ ప్రభుత్వం.. గోదావరి, కావేరి నదుల అనుసంధానంలో తరలించే నీటిలో సగం వాటా ఇవ్వాలని జాతీయ జల అభివృద్ధి సంస్థను కోరింది. అయితే 33 శాతం నీటి వాటాకు ఒప్పుకోవాలని సంస్థ విజ్ఞప్తి చేసినా కూడా.. 50 శాతానికి తగ్గకుండా నీళ్లు ఇవ్వాల్సిందేనని తెలంగాణ తేల్చిచెప్పింది.

Also read: సౌత్ కొరియాలో 'ఎమర్జెన్సీ మార్షియల్ లా' ప్రకటించిన అధ్యక్షుడు

 దక్షిణ తెలంగాణలో ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అనేక ప్రాంతాలు కరవు పీడిత ప్రాంతాలుగా ఉన్నాయని.. 75 ఏళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ అక్కడ ఇరిగేషన్ వాటర్ సౌకర్యం లేదని చెప్పింది. ఆయా ప్రాంతాలకు నీటిని అందించాలంటే నీటి వాటాలో తమ హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అయితే తాజాగా మరోసారి తెలంగాణ నీటిలో సగం వాటా ఇవ్వాలని అడగటం ప్రాధాన్యం సంతరించుకుంది. మరి జాతీయ జల అభివృద్ధి సంస్థ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేదానిపై ఆసక్తి నెలకొంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు